Curd Uses: పెరుగులో ఈ పదార్థాలు కలపడం వల్ల అందం మీ సొంతం
Curd Facepack Benefits: ఆరోగ్యకరమైన చర్మని పొందాలిని అనుకొనేవారు ప్రతిరోజు పెరుగుతో ఇలా చేయడం వల్ల మీ చర్మం ఎంతో కాంతివంతంగా, అందం కనిపిస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. పెరుగుతో కాంతివంతమైన చర్మం పొందడం ఎలా అనే విషయంపై మనం ఇపుడు తెలుసుకుందాం.
Curd Facepack benefits: శరీర ఆరోగ్యంతో పాటు ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో పెరుగు ఎంతో దోహదపడుతుందని చర్మ వైద్యులు చెబుతున్నారు. పెరుగులో ఉండే పోషకాలు, యాంటీ ఇన్ ప్లామేషన్ గుణాలు చర్మ సమస్యలను తగ్గించి ఫేస్‌ను అందంగా కనిపించేలా సహాయపడతాయి. పెరుగును ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే మచ్చలను, మొటిమలను, నలుపుదనాన్ని సులభంగా తగ్గిపోతుంది.
పెరుగును ఎలా వాడడం వల్ల అందంగా కనిపించవచ్చు అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగును మీ చర్మ తత్వాన్ని బట్టి వాడాలి. అది ఎలా అంటే జిడ్డు చర్మం ఉన్న వారు పుల్లటి పెరుగును వాడాలి. పొడి చర్మం ఉన్న వారు తియ్యటి మీగడ పెరుగును ఉపయోగించాలని వైద్యులు చెబుతున్నారు. ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోండి ఇలా..
Also read: Masturbation Benefits: హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిదా? కాదా?
ఒక గిన్నెలో టీ స్పూన్ పెరుగును తీసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ గోధుమ పిండిని కలుపుకోవాలి. ఈ గోధుమపిండి ఫేస్‌కు బ్లీచింగ్ ఏజెంట్ లాగా పని చేస్తుంది. ఈ మిశ్రమాని ఫేస్‌కు పట్టించాలి. అయితే జిడ్డు చర్మం ఉన్న వారు ఇందులో నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. కొద్దిగా సేపు తర్వత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, నలుపుదనం, మృత కణాలు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది.
Also read: Sugarcane Juice: చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండి చెరుకు రసంతో...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter