COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Diabetes And Custard Apple:  డయాబెటిస్‌ ఉన్నారు కొన్ని ఆహారపదార్థాలు తినే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు విషయంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే  డయాబెటిస్‌తో బాధపడే వారు సీతాఫలం తినొచ్చా? అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది. సీతాఫలం రుచికరమైన పండు అయినప్పటికీ, ఇది తీయగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ పెరగవచ్చనే భయం కూడా ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. 


సీతాఫలం  ప్రయోజనాలు:


సీతాఫలంలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి  ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక ప్రాత పోషిస్తాయి. సీతాఫలం లో గ్లైసెమిక్ ఇండెక్స్ మితంగా ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచదు.  సీతాఫలంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, ముడతలు పడకుండా ఉంచుతుంది. ఇందులో  విటమిన్ కె ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. సీతాఫలంలో ఉండే విటమిన్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.


డయాబెటిస్‌తో బాధపడేవారు ఎలా తీసుకోవాలి?


సీతాఫలంలో కొంత చక్కెర ఉంటుంది కాబట్టి, దీన్ని మితంగా తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు పండ్లు తినడం సురక్షితంగా ఉంటుంది.  తినేటప్పుడు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా తీసుకోవాలి.  ఏదైనా మధుమేహం మందులు వాడుతున్నట్లయితే, సీతాఫలం తీసుకునే ముందు మీ వైద్యునితో మాట్లాడండి. సీతాఫలం తీసుకున్న తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిలను చెక్‌  చేయండి. 


సీతాఫలాన్ని ఎప్పుడు తినాలి?


భోజనం తర్వాత కొంత సమయానికి తీసుకోవడం మంచిది. లేదా ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవడం మంచిది. వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి శక్తి అవసరం. ఈ సమయంలో సీతాఫలం తినడం మంచిది.


సీతాఫలాన్ని ఎప్పుడు తినకూడదు: రాత్రి సమయంలో సీతాఫలం తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మందగిస్తుంది, నిద్రను ప్రభావితం చేస్తుంది.


ముగింపు:


డయాబెటిస్ ఉన్నవారు సీతాఫలాన్ని తినవచ్చు కానీ మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.


గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.


Also Read: Viral Video: ఇదేక్కడి న్యాయం..?.. కండక్టర్ డ్యాన్స్‌కు మంత్రి ఫిదా.. ఉద్యోగం ఊడగొట్టిన ఏపీఎస్ఆర్టీసీ..స్టోరీ ఏంటంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.