Cardamom Benefits: గరం మసాలా పదార్ధాలు లేకుండా భారతీయ వంటలుండవు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, అమోఘమైన రుచి వస్తుంది. ఇలాచీ కూడా అటువంటిదే. ఇలాచీతో కలిగే ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాచీ అంటేనే మంచి ఘుమఘుమలాడే సువాసన గుర్తొస్తుంది. ఎక్కువగా స్వీట్స్, టీ, పలావు, బిర్యానీ వంటి వంటకాల్లో ఉపయోగిస్తారు. వంటల్లో ఇలాచీ వాడటం వల్ల ఆ వంటలకు రుచి, సువాసన పెరగడమే కాదు..ఆరోగ్యానికి చాలా ప్రయోజనకారిగా మారుతుంది. ఇలాచీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం..


ఇలాచీని సాధారణంగా చాలామంది మౌత్ ఫ్రెష్‌నర్‌గా వాడుతుంటారు. కానీ రోజూ ఇలాచీ నమలడం అలవాటు చేసుకుంటే నోటి దుర్వాసన దూరమౌతుంది. ముఖం అందంగా, తెల్లగా కన్పించాలంటే ఇలాచీ వాడమంటున్నారు బ్యుటీషియన్లు. ఇలాచీ నూనెను ముఖానికి రాసుకుంటే..ముఖంపై మచ్చలు, మరకలు తొలగిపోతాయి. ముఖంపై నిగారింపు వస్తుంది. ఒకవేళ ఇలాచీ పౌడర్ రాసుకోవాలనుకుంటే..అందులో కొద్దిగా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని..కాస్సేపటి తరువాత శుభ్రంగా నీళ్లతో కడగాలి. 


ఇలాచీనీ మార్కెట్‌లో లభించే చాలా రకాల బ్యూటీ ఉత్పత్తుల్లో అందుకే వాడుతుంటారు. ముఖ్యంగా క్రీమ్స్‌లో వినియోగిస్తారు. మీరు కూడా ఇలాచీ పౌడర్ చేసుకుని..కొద్దిగా తేనె మిక్స్ చేసి పెదాలపై రాసుకుంటే లిప్‌కేర్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా రాస్తుంటే మీ పెదాలు మృదువుగా, అందంగా తయారౌతాయి. రోజూ ఇలాచీ తినడం అలవాటు చేసుకుంటే..శరీరంలోని విష పదార్ధాలు వేగంగా బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా మీ శరీరం డీటాక్స్ అవుతుంది. ఆ ప్రభావమంతా మీ ముఖంపై స్పష్టంగా కన్పిస్తుంది. చర్మం మృదువుగా మారడమే కాకుండా..ముఖంపై ఊహించని గ్లో కన్పిస్తుంది. 


Also read: Vitamin B12 Benefits: విటమిన్ బి 12 శరీరంలో కోరతగా ఉంటే.. ఈ సమస్యలు తప్పవు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.