COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Carrot Fried Rice: ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలామంది బయట ఫాస్ట్ ఫుడ్స్‌లో లభించే ఫ్రైడ్ రైస్‌ను అతిగా తింటూ ఉంటారు. ఇలా ప్రతిరోజు తినడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటికి బదులుగా ఇంట్లోనే సులభంగా ఆరోగ్యకరమైన ఫ్రైడ్ రైస్‌లను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికోసం క్యారెట్లతో తయారుచేసిన ఫ్రైడ్ రైస్‌ను వారంలో రెండు సార్లు అయినా లంచ్ బాక్స్‌లో ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. క్యారెట్ లో ఉండే పోషకాలు శరీరానికి తగిన మోతాదులో లభించి దీర్ఘకాలిక వ్యాధుల వారిన పడకుండా ఉంటారు. అయితే ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెసిపీని తయారు చేసుకోవడం చాలా సులభం. మీరు కూడా ఇంట్లోనే దీనిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ పద్ధతిలో తయారు చేసుకోండి. 


కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 కప్పు
క్యారెట్లు - 2 (తురిమినవి)
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
మిరపకాయ పొడి - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - అలంకరించడానికి


తయారీ విధానం:
ముందుగా ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
బౌల్లో బియ్యాన్ని వేసుకొని 30 నిమిషాల పాటు నాన పెట్టాల్సి ఉంటుంది.
ఇలా నానబెట్టిన బియ్యాన్ని మూడు నుంచి నాలుగు సార్లు బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
బాగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఆ తర్వాత ఇందులోనే తరిగిన క్యారెట్లు, పచ్చిమిరపకాయలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి.
క్యారెట్ ముక్కలు బాగా వేగిన తర్వాత మిరపకాయ పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని రైస్ లా తయారు చేసుకొని పైన రెడీ చేసుకున్న మిశ్రమంలో వేసి ఐదు నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోవాలి. 
కావాలనుకుంటే ఇలా తయారు చేసుకున్న రైస్ లో టమాటో కెచప్ ను కూడా వినియోగించవచ్చు. దీనిని వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే క్యారెట్ రైస్ రెసిపీ తయారైనట్లే. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


చిట్కాలు..
ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ లో కావాలనుకుంటే కూరగాయలను కూడా వినియోగించవచ్చు. అన్ని రకాల కూరగాయలను మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. 
ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ లో కావాలనుకుంటే నిమ్మరసం కూడా కలుపుకొని తయారు చేసుకోవచ్చు. 
ఇందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలను వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత పెరిగే అవకాశాలున్నాయి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి