Ageing Process: వయస్సుతో పాటు ముసలితనం రావడం సహజం. అయితే మీ ఆహారపు అలవాట్లు, దైనందిన అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకుంటే వయస్సు మీదబడినా..వృద్ధాప్యపు ఛాయలు కన్పించకుండా చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా వయస్సు రాకుండానే వృద్ధాప్యపు ఛాయలు ముఖంలో కన్పిస్తుండటం ఇబ్బందిగా మారుతోంది. ముప్పై, నలభై ఏళ్లకే 50 పైబడినట్టు కన్పిస్తున్నారు. మనం చేసే తప్పులే దీనికి కారణం. చాలా సాధారణమైన మార్పులతో ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.


ప్రధానంగా బ్లూ స్క్రీన్స్ చూడటమనేది చాలావరకూ తగ్గించుకోవాలి. బ్లూ లైట్ ఎక్కువగా కళ్ల మీద పడటం వల్ల వయస్సు పెరిగినట్టు కన్పిస్తుంది. కంప్యూటర్ స్క్రీన్స్, ఫోన్ స్క్రీన్స్‌కు సాధ్యమైనంత దూరంలో ఉండాలి. 2019లో ప్రచురితమైన ఏజింగ్ అండ్ మెకానిజమ్స్ ఆఫ్ డిసీజ్ జర్నల్‌లో ఈ విషయాలున్నాయి. ఎక్కువ సేపు బ్లూ స్క్రీన్స్ చూడటం వల్ల మెదడు, కళ్లలోని కణాలు దెబ్బతింటాయని తెలుస్తోంది. అందుకే సహజకాంతి మంచిదని..స్క్రీన్ టైమ్ తగ్గించుకుంటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. 


మరో అలవాటు ముఖానికి మాయిశ్చరైజర్. చాలామంది మాయిశ్చరైజర్ వాడరు. దాంతో ఏజియింగ్(Ageing)ముందుగా కన్పిస్తుంది. మాయిశ్చరైజర్ వల్ల చర్మంలో నీటిశాతం పెరిగి..చర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే మాయిశ్చరైజర్ అలవాటు చేసుకుంటే మంచిది. సరైన నిద్ర లేకపోవడం కూడా ప్రధాన కారణం. క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ డెర్మటాలజీ ఆర్టికల్ ప్రకారం కావల్సినంత నిద్ర ఉండే మహిళల్లో(Sleep)30 శాతం మందికి ముసలితనమే కన్పించదట. రోజుకు 7 గంటల నిద్ర మనిషికి తప్పనిసరి. 


ఇక ఆల్కహాల్ (Alcohol)ఎక్కువగా తీసుకునేవారిలో కూడా ముసలితనం త్వరగా కన్పిస్తుంది. ఎందుకంటే ఆల్కహాల్ అనేది చర్మాన్ని పూర్తిగా డీహైడ్రేట్ చేసేస్తుంది. ముడతలు, ఎర్రగా మారడం, కళ్లు వాసినట్లుంటడటం ప్రధానమైన సమస్యలు. కేన్సర్, హార్ట్ డిసీజ్ తగ్గించుకోవాలంటే మోతాదుకు మించి తాగకపోవడమే మంచిది. ఇక తీపి కూడా తక్కువగా తినడం మంచిది. ఎక్కువగా తీసుకుంటే కార్పొహైడ్రేట్స్ వయస్సు ఎక్కువ కన్పించేలా చేస్తుంది. చర్మంపై ముడతలు ఎక్కువవుతాయి. అటు పండ్లు కూడా బాగా పండకుండా దోరగా ఉండేవి తినడం మంచిది. 


Also read: Dreams Interpretation: కలలో పాములు, చితి కన్పిస్తున్నాయా..ఆ కలలకు అర్ధం ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook