Dreams Interpretation: పగటి కలలు, రాత్రి కలలు చాలా రకాలుగా ఉంటాయి. కలలు మనిషి మానసిక స్థితిని బట్టి ఉంటాయనేది చాలామంది చెప్పేమాట. అయితే శాస్త్రాలు అంటే మతం మాత్రం వేరేగా చెబుతోంది. వచ్చే కలలు శుభం, అశుభానికి సంకేతాలనేది పండితుల మాట. కొన్ని కలలు భయంకరంగా ఉన్నా ఫలితం మాత్రం బాగుంటుందట. అదే కలల్లో ఆనందం కన్పిస్తే మాత్రం నిజ జీవితంలో అశుభం జరగడానికి సంకేతాలని మరి కొందరంటారు. మీ కలల్లో పాములు లేదా చితి కన్పిస్తోందా..దానికి అర్ధమేంటో తెలుసుకుందాం.
కలలో చితి కాలుతున్న దృశ్యం కన్పిస్తే..అది కచ్చితంగా అశుభ సూచకమేనట. ఇలా కన్పించడం..మీ సోదరుడితో లేదా సమీప బంధువుతో తీవ్రమైన వివాదానికి సంకేతమట. బంధాలు దూరమవుతాయనేందుకు ఇది సంకేతమట.
ఎవరైనా వృద్ధులకు కలలో మృతదేహం కన్పించినా కూడా దానర్ధం శుభసూచకమే. ఏదో ఒక రోగం నుంచి విముక్తి కల్గుతుందనేందుకు సంకేతమని అర్ధమట.
ఒకవేళ ఎవరైనా వ్యాపారి కలలో మృతదేహం కన్పిస్తే మాత్రం చాలా శుభసూచకమని అర్ధం. ఊహించని అతి పెద్ద ఆర్ధిక ప్రయోజనం కలుగుతుందని అర్ధమట.
కలలో మృతదేహం కన్పించడం కూడా శుభసూచకమే. మృతదేహాం కన్పిస్తే అశుభమని భావిస్తాం గానీ..శుభసూచకమనేది పండితుల మాట. ఆర్ధికంగా ఎదుగుతారనేందుకు సూచకమట.
మీకు కలలో చచ్చిన పాము కన్పిస్తే..సహజంగా భయం కలుగుతుంది. కానీ ఇది శుభానికి ప్రతీక అట. దీనర్ధం ఏంటంటే..మీ జీవితంలో ఉండే దుఖాలు, ఇబ్బందులు ఇకపై తొలగిపోతాయని అర్ధం. రాహువు ప్రభావం ముగియడానికి సంకేతమట.