Coconut Oil Benefits: కొబ్బరి చెట్టును కల్పవృక్షం  లాంటిదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. కొబ్బరి చెట్టు నుంచి లభించే ప్రతి భాగం ఎంతో విలువైనది. అందులో ఒకటి కొబ్బరి నూనె. కొబ్బరి నూనెను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఇందులో  మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం,విటమిన్ ఇ, యాంటీమైక్రోబయల్‌,  యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఇన్ని లాభాలు ఉన్న కొబ్బరి నూనెను నేరుగా తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నూనెను నేరుగా తాగవచ్చా..? దీని వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అనే వివరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కొబ్బరి నూనె అనేది ఒక సహజమైన నూనె. ఇది వంట, అందం, ఆరోగ్యం కోసం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. తూర్పు దేశాల్లో ప్రత్యేకంగా ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఇది తీపి వాసనతో ఉంటుంది. ప్రతిరోజు ఒక స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల రోజంతా రిఫ్రెష్‌గా ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఉదయం తాగడం వల్ల శరీరంలో దృఢంగా, బలంగా ఉంటుందని చెబుతున్నారు. కొబ్బరి నూనెలో ఉండే మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలు (MCTs) శరీరంలోని కొవ్వును తగ్గించడానికి, జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.  కొబ్బరి నూనె చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది చర్మాన్ని తేమగా ఉంచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇది అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


కొబ్బరి నూనె ఎలా తీసుకోవాలి: 


ఆహారంలో చేర్చుకోవడం:


వంట చేయడానికి: కొబ్బరి నూనెను వేడి చేసినప్పుడు దాని పోషక విలువలు పోకుండా ఉంటాయి. దీనితో వంటలు చాలా రుచికరంగా ఉంటాయి.


సలాడ్‌లకు: సలాడ్‌లకు కొబ్బరి నూనెను జోడించడం వల్ల రుచి మరింతగా పెరుగుతుంది.


రొట్టెలు, దోసెలు: ఇలాంటి వాటికి కొబ్బరి నూనెను రాసుకోవచ్చు.


చర్మ సంరక్షణ:


మాయిశ్చరైజర్‌గా: కొబ్బరి నూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.


మసాజ్ ఆయిల్‌గా: శరీరానికి మసాజ్ చేయడానికి కొబ్బరి నూనెను వాడవచ్చు.


జుట్టు సంరక్షణ:


హెయిర్ మాస్క్‌గా: కొబ్బరి నూనె జుట్టుకు మంచి హెయిర్ మాస్క్.


స్కల్ప్ మసాజ్: తలకు మసాజ్ చేయడానికి కొబ్బరి నూనెను వాడవచ్చు.


కొబ్బరి నూనె ఎంత తీసుకోవాలి?


రోజుకు ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె తీసుకోవచ్చు. దీని తీసుకొనే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.