Cucumber Juice For Hair Growth: మన శరీరాన్ని డీహైడ్రేషన్  సమస్యల నుంచి రక్షించడానికి దోసకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే దోసకాయ రసం ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రసం జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ రసాన్ని తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా ప్రస్తుతం చాలా మంది గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ దోసకాయ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోషక విలువలు తగిన పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.


దోసకాయ రసం చేయడానికి కావలసినవి పదార్థాలు:
2 దోసకాయ
1/2 అంగుళాల అల్లం  ముక్క
1/4 నిమ్మకాయ రసం
1 టేబుల్ స్పూన్ పచ్చి కొత్తిమీర
1 టేబుల్ స్పూన్ పుదీనా
బ్లాక్ సాల్ట్
1 టేబుల్ స్పూన్ తేనె
2 కప్పులు నీరు


దోసకాయ రసం తయారుచేసే విధానం:
దోసకాయ రసం చేయడానికి.. ముందుగా దోసకాయను ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో ఉంచండి.  అందులోనే అల్లం, కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా సన్నగా తరముకోవాలి. వీటిని గ్రైడ్‌ చేసి.. రసం చేసుకోవాలి. ఈ జ్యూస్‌లోనే రసం వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత అందులో కావాలనుకుంటే ఐస్‌ ముక్కలను సర్వ్‌ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జట్టు రాలడం తగ్గుతుంది.


Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..! 


Also Read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook