Curd & Milk for Weight Loss: ఒక్కోసారి శరీర బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టంగా మారింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం చాలా మంది వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. దీని కారణం చాలా మంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్‌ పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల వ్యాయమాలు చేస్తున్నారు. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. బరువు పెరగడం సమస్య నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఆహార నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలు, పెరుగులో బరువు తగ్గించే ఆహారం ఏది?:


బరువు తగ్గించే ప్రక్రియలో ఉన్నప్పుడు పాలు, పెరుగు వంటి ఉత్పత్తులను తినాలా వద్దా.. అనే ప్రశ్న చాలా మంది మదిలో ప్రశ్నగానే మిగిలిపోయింది. తిన్న వాటిని ఎంత పరిమాణంలో తినాలి..?  అయితే పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతే మోతాదులొ కొవ్వు కలిగిన మూలకాలు కూడా ఉంటాయి. కాబట్టి  దీని గురించి ప్రముఖ పోషకాహార నిపుణుడు 'నిఖిల్ వాట్స్' ఏమన్నారో తెలుసుకుందాం..


జీర్ణక్రియ మెరుగుపడడానికి పెరుగు చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా పొట్టను చల్లగా ఉంచి.. బరువు నియంత్రింస్తుంది. పెరుగును తినే క్రమంలో నల్ల ఉప్పు కలిపి తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.


బరువు తగ్గడంతోపాటు వ్యాయామాలు చేసే పనిలో ఉంటే.. తరచుగా పాలు, పండ్లను తీసుకుంటారు. కానీ పాలు, పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది కాదు. 


బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఆకు కూరలను తీసుకోవాలి. వీటిలో పెరుగును కలిపి పచ్చిగా తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు.


పెరుగులో ప్రోబయోటిక్స్ శాతం అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది. 


బరువు తగ్గే సమయంలో వర్కవుట్స్‌ చేస్తూ ఉంటారు. దీని కోసం బలమైన ఎముకలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో పెద్ద మొత్తంలో శరీరానికి కాల్షియం అవసరం ఉంటుంది. కావున దీనిని పెరుగు, పాల ఉత్పత్తుల ద్వారా  పొందవచ్చు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Read also: Coivd New Wave: కొవిడ్ కొత్త వేవ్ తో రోజుకు 50వేల కేసులు.. మాస్క్ లేకుంటే అంతే?


Read also: Chittoor: చిత్తూరులో అర్ధరాత్రి హైడ్రామా..  మాజీ మేయర్ హేమలతను ఢీకొట్టిన పోలీస్ జీపు..? గాయాలతో ఆసుపత్రిలో చేరిక 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.