COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Daggu Jalubu Chitkalu Telugu: శీతాకాలంలో శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోయి జలుబు, ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి. దీని కారణంగా చాలా మంది విపరీతమై దగ్గు వంటి సమస్యల బారిన కూడా పడుతున్నారు. ఈ సందర్భంలోనే కొంత మందిలో గొంతు నొప్పి కూడా వస్తోంది. అయితే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన దగ్గు సిరప్‌లను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో తప్పకుండా కొన్ని ఆహారాలు తీసుకోవడం పూర్తిగా మానుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారాలేంటో ఎందుకు వాటిని తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


నిమ్మ, సిట్రస్ పండ్లు:
నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దగ్గు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే దగ్గు వంటి సమస్యలతో బాధపడతున్నవారు పులుపు కలిగిన పండ్లు, పైనాపిల్, నారింజను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. 


చల్లని పండ్ల:
ప్రస్తుతం చాలా మంది రిఫ్రిజిరేటర్‌లో ఉండే పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. కాబట్టి దగ్గుతో పాటు జలుబు వంటి సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు తీసుకోవడం గొంతు నొప్పులు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు కొంతమందిలో దగ్గు తీవ్రత కూడా పెరగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


కూల్ డ్రింక్స్‌:
అతిగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్నవారు కూల్ డ్రింక్స్‌ తాగడం కూడా మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గొంతు నొప్పి విపరీతంగా పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా దీని కారణంగా కొంతమందిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి శీతాకాలంలో కూల్‌ డ్రింక్స్‌ తాగడం మానుకోవాల్సి ఉంటుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


పుల్లని ఆహారాలు:
దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు యాసిడ్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిల్లో ఉండే గుణాలు దగ్గును పెంచి గొంతు నొప్పికి దారీ తీసే చాన్స్‌ ఉంది. అంతేకాకుండా జలుబు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter