ఎడారి ప్రదేశాల్లో లభించే ఖర్జూరం రుచిలో అమృతమే. కేవలం రుచి ఒక్కటే కాదు ఆరోగ్యపరంగా కూడా అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. రోగ నిరోధక శక్తిని దూరం చేసేందుకు ఖర్జూరాన్ని మించింది లేనే లేదు. ఖర్జూరంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖర్జూర పండ్లలో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. రక్త హీనత సమస్య లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే..చిన్న పని చేసినా అలసట వస్తుంటుంది. అటువంటప్పుడు మీ డైట్‌లో ఖర్జూరం చేరిస్తే మంచి ప్రయోజనముంటుంది. ఇందులో ఐరన్, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. పరగడుపున ప్రతిరోజూ ఖర్జూరం తీసుకుంటే ఇందులో ఉండే పోషక పదార్ధాలు శరీరంలో పూర్తిగా జీర్ణమౌతాయి. 


ఖర్జూరం పండ్లు డయాబెటిస్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది సహజసిద్ధమైన షుగర్‌తో కూడుకున్నది. అందుకే ఆరోగ్యానికి ఏ విధమైన హాని చేకూర్చదు. తీపి పదార్ధాలకు దూరంగా ఉండేవారు కూడా ఖర్జూరం తీసుకుంటే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌‌ఫాస్ట్‌లో కనీసం రెండు ఖర్జూరం పండ్లు తింటే..శరీరానికి ఎనర్జీ పుష్కలంగా లభిస్తుంది. 


ఉదయం పరగడుపున తీసుకుంటే..


ఖర్జూరమనేది శరీరంలో హిమోగ్లోబిన్ పెంచి.ఎనీమియా సమస్యను దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున..మలబద్ధకం సమస్య దూరమౌతుంది. జీర్ణక్రియ కూడా సజావుగా సాగుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది, అందరూ కోరుకునేది బరువు తగ్గడం. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఖర్జూరమే. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలు లభించడమే కాకుండా ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు నియంత్రణకు సాధ్యమౌతుంది. ఖర్జూరం బ్లడ్ సర్క్యులేషన్‌కు దోహదపడుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.


మగవారి ఆ సమస్యకు చెక్


మగవారిలో ఉండే సంతాన సాఫల్యత సామర్ధ్యాన్ని ఖర్జూరం పెంచుతుంది. అంటే మగవారిలో సంతాన సాఫల్యత లేకపోవడానికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ లేదా స్పెర్మ్ మొటిలిటీ. ఈ రెండూ ఖర్జూరం ద్వారా మెరుగుపడతాయి. ప్రతిరోజూ పాలతో కలిపి ఖర్జూరం తీసుకుంటే మగవారిలో ఫెటిలిటీ పెరుగుతుంది. రోజూ 2-3 ఖర్జూరం పండ్లు పాలలో ఉడికించి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. 


Also read: Yoga for Belly Fat: ఆ ఒక్క ఆసనం చాలు..బెల్లీ ఫ్యాట్‌ను 2 నెలల్లో మాయం చేస్తుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook