నిత్య జీవితంలో ఎదుర్కొనే చాలా రకాల సమస్యలకు యోగాతో చెక్ పెట్టవచ్చు. ఇది కేవలం వ్యాయామ ప్రక్రియే కాకుండా ఆరోగ్యాన్ని అందించే ఓ సాధన ప్రక్రియ. అందుకే ఇండియాలో పుట్టిన యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది.
ఆధునిక పోటీ ప్రపంచంలో ఎదురౌతున్న ప్రధాన సమస్య ఒత్తిడిని జయించడంలో యోగాను మించింది లేదంటారు. యోగాతో శరీరం క్రమబద్ధంగా ఉంటుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే..చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యకు యోగా అద్భుత సాధనం. దీనికోసం యోగాలోని పవన్ ముక్తాసనం మంచిదట. ఆ ఆసనం ఏంటి, ప్రయోజనాలేంటి, ఎలా వేయాలనేది తెలుసుకుందాం.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. ఈ సమస్యల్నించి మిమ్మల్ని గట్టెక్కించేది పవన్ ముక్తాసనం. కడుపు బరువుగా ఉంటే తగ్గించడం, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం, నెర్వస్ సిస్టమ్ స్టిమ్యులేషన్, కడుపులోంచి గ్యాస్ బయటకు తీయడంలో పవన్ ముక్తాసనం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని విషపూర్తి వ్యర్ధాల్ని తొలగించడంలో దోహదం చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం..
పవన్ ముక్తాసనం అనేది రెండు పదాల కలయి. పవన్ మరియు ముక్త. ఇందులో పవన్ అంటే గాలి, ముక్త అంటే వదలడం. పవన్ ముక్తాసనం అనేది ఓ రిలాక్సింగ్ ప్రక్రియలో భాగమైన ఆసనం. ఈ ఆసనంలో ప్రధానంగా వీపుపై పడుకుని శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు మీ రెండు కాళ్లను ఒకేరీతిలో దగ్గరకు తీసుకుని..మీ రెండు చేతుల్ని రెండు మోకాళ్లపై నుంచి బంధించండి.ఆ తరువాత మీ మోకాళ్లను మీ కడుపుకు ఆన్చండి. ఎంత వీలైతే అంతగా చేర్చాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ..మీ మోకాళ్లను ఛాతీవైపుకు తీసుకురండి. పది సెకండ్ల వరకూ శ్వాసని నిలిపి..అదే దశలో ఉండాలి. తరువాత కాళ్లను నిటారుగా చేసేయాలి. ఇలా 2-3 సార్లు చేస్తే చాలా రిలాక్సింగ్ లభిస్తుంది.
కడుపులో అదనంగా పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో ఈ ఆసనం ఉపయోగపడుతుంది. గర్భాశయ సంబంధిత రోగాల్ని దూరం చేస్తుంది. నడుము నొప్పి లేదా స్లిప్ డిస్క్‌లో ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. ఎసిడిటీ, ఆర్ధరైటిస్, గుండెపోటు రోగాలున్నవారికి ఈ ఆసనం చాలా మంచిది. ఈ ఆసనం తరచూ వేయడం వల్ల లివర్ పనీతీరు కూడా మెరుగుపడుతుంది.
Also read: Green Chillies Benefits: ఆరోగ్యాన్ని అందించే అద్భుత ఔషధం, పచ్చిమిర్చితో కలిగే ఐదు లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook