Diabetes Control Food: ఇలా చేస్తే తీవ్ర మధుమేహానికి కేవలం 14 రోజుల్లో చెక్ పెట్టండి..
Diabetes Control In 14 Days: మధుమేహం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Diabetes Control In 14 Days: ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భారత దేశంలో ఈ వ్యాధి విచ్చల విడిగా పెరుగుతుంది. అయితే ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిది లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు జీవన శైలే కాకుండా జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలైన గుండె జబ్బులతో పాటు అనేక ఇతర వ్యాధులు కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెపుతున్నారు. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:
ఆహారం నుంచి వీటిని తొలగించండి:
డయాబెటిక్ పేషెంట్లు అస్సలు పానీయాలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావడంతో పాటు ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. రక్తంలో చక్కెర పరిమాణాలు పెంచే బంగాళాదుంపలను తీసుకోవద్దు.
ఈ ఆహారాలను తీసుకోండి:
మధుమేహంతో బాధపడుతున్నవారు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే డైట్‌లో భాగంగా వీరు కేవలం ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు కాలీఫ్లవర్, క్యాబేజీ, బీన్స్ తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
లంచ్ లేదా డిన్నర్‌లో ఇలా చేయండి:
మధుమేహంతో బాధపడేవారు ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు నడవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి.
టెన్షన్ పడకూడదు:
డయాబెటిక్ పేషెంట్స్ ఒత్తిడికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒత్తిడికి గురవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీని వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook