Diabetes Prevention Top Tips In Winter: డయాబెటిస్ సమస్య అనేది ఒక సాధారణ వ్యాధి. నేటికాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్యనిపుణుల ప్రకారం చలికాలంలో షుగర్ లెవల్స్ అధికంగా పెరుగుతాయి. మీరు కూడా అధిక షుగర్ లెవల్స్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసం. వీటిని పాటించడం వల్ల షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో షుగర్‌ ఎందుకు పెరుగుతుంది? 


చలికాలంలో చాలామంది వ్యాయామం చేయడానికి ఇష్టపడరు. శారీరక శ్రమ తగ్గడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో  శరీరం వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. దీని వల్ల దీనివల్ల జీవక్రియ రేటు తగ్గుతుంది. జీవక్రియ తగ్గడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. చలికాలంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. ఈ ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి కాబట్టి షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయి. కొన్ని రకాల మందులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.  అలాగే కొన్ని వైద్యపరమైన పరిస్థితులు కూడా చలికాలంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి దోహదపడతాయి. ఈ సమయంలో డయాబెటిస్‌ ఉన్నవారు షుగర్‌ను కంట్రోల్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. 


చలికాలంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడానికి చిట్కాలు:


పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు వంటి పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది. దీని షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది.  ఫైబర్ శరీరంలోని చక్కెర శోషణను నెమ్మదిగా చేస్తుంది. కాబట్టి బియ్యం, గోధుమలు, మొక్కజొన్న వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది. ఈ రకమైన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవు. ఉదాహరణకు, బ్రౌన్ రైస్, ఓట్స్, పప్పులు మొదలైనవి. వీటితో పాటు మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మంచి కొవ్వులు అయిన ఆలివ్ ఆయిల్, అవకాడో వంటివి తీసుకోవడం మంచిది. కానీ, చెడు కొవ్వులను తగ్గించాలి.


ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వ్యాయామం శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. డాక్టర్ సూచించిన మందులను సక్రమంగా తీసుకోవడం చాలా ముఖ్యం. మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి రోజూ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. చల్లటి వాతావరణంలో శరీరం ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. కాబట్టి వెచ్చగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. క్రమంగా ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.


గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పకుండా మీ డాక్టర్‌ను సంప్రదించండి.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి