Deepavali 2023: దీపావళి అంటే ఇంటిని మొత్తం దీపాలతో ,పువ్వులతో నింపేస్తాము . మన చుట్టుపక్కల అందరికంటే కూడా మన హౌస్ అందంగా ఉండాలి అన్న తపనతో ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇంటి పైన పెడతాం. ఈ క్రమంలో అమ్మాయిలు ఫుడ్, నిద్ర ఏమి పట్టించుకోరు. ఒకపక్క పని ఒత్తిడి..మరొకపక్క ఇంటి పనులు అన్ని బ్యాలెన్స్ చేస్తూ తమ గురించి తాము అశ్రద్ధ చేస్తారు. మరి దీపావళికి ఎంచక్కా రెడీ అయి ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో హడావిడి చేయాలా? వద్దా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ పొద్దున్నుంచి పని చేసి అలసిపోయి ఈవెనింగ్ ఫోటోలు దిగాలి అంటే సగం మందికి ఓపిక ఉండదు సగం మందికి స్కిన్ సరిగ్గా లేదు..మేకప్ సెట్ కాలేదు అన్న డిస్టిస్ఫాక్షన్ మొదలవుతుంది. ఇలా అవ్వడానికి కారణం పండుగ హడావిడిలో పడి వాళ్ళు తమ గురించి తాము శ్రద్ధ తీసుకోకపోవడం.మరి పండుగ హడావిడిలో కూడా మీ బ్యూటీ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.


పండుగ సమయంలో చాలామంది చేసే మొదటి తప్పు పని హడావిడిలో పడి మంచినీళ్లు తాగడం మర్చిపోతారు. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ డిహైడ్రేట్ అయ్యి బాగా పగిలినట్టు అవుతుంది. అలాంటప్పుడు ఎంత మేకప్ వేసిన మీ ఫేస్ పై సెట్ కాదు. పైగా కొన్ని సందర్భాలలో ఇలా ఓవర్ డిహైడ్రేషన్ వల్ల వయసు పైబడినట్లు కనిపిస్తారు. చర్మానికి అవసరమైన హైడ్రేషన్ అందినప్పుడే అది యవ్వనంగా, బౌన్సీగా ఉంటుంది.కాబట్టి పండగ హడావిడి ఎంత ఉన్నా సరే రోజుకి నాలుగు లీటర్ల నీళ్లు తాగడం మాత్రం మర్చిపోకండి.


పండుగకి ఇంటి క్లీనింగ్ చేసే సమయంలో మన స్కిన్ పై చాలా డస్ట్ పేరుకుంటుంది. దాని ఎఫెక్ట్ వెంటనే తెలియకపోయినా కొన్ని రోజులకి ఫోర్స్ క్లోజ్ అయి పింపుల్స్ వచ్చేస్తాయి. కాబట్టి పండుగ క్లీనింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి క్రమం తప్పకుండా నైట్ టైం పడుకునే ముందు ఫేస్ కి బాగా స్టీమ్ పెట్టి స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత హైలురోనిక్ యాసిడ్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా సీరమ్‌ని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద మృత కణాలు తొలగడమే  కాకుండా స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది. 


పండుగ సమయంలో ఎన్ని పనులు ఉన్నా సరిగ్గా నిద్రపోవడం కూడా ఎంతో ముఖ్యం. నిద్ర తక్కువ అయితే దాని ప్రభావం నేరుగా మన ఫేస్ పైన రింకిల్స్, డార్క్ సర్కిల్స్ రూపంలో కనిపిస్తుంది. కాబట్టి రెస్ట్ కూడా కంపల్సరీ. మరి ఇంకెందుకు ఆలస్యం ఇవన్నీ పాటించి చూడండి .. ఫెస్టివ్ గ్లో మొత్తం మీ మొహం పైనే కనిపిస్తుంది..


Also Read: Kalabhavan Haneef: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత


Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు   



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook