Dandruff Removal Tips: చుండ్రు చాలా మందిని బాధించే సాధారణ సమస్య. ఇది చర్మం పొడిగా మారడం, దురదగా ఉండటం వంటి అసౌకర్యాలను కలిగిస్తుంది. అంతేకాకుండా చుండ్రు తీవ్రంగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లను బలహీనపరచడం వల్ల జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. చుండ్రును నివారించడానికి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఇంట్లోనే సులభంగా అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేయగల అనేక సహజ చికిత్సలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిర్యానీ ఆకు కేవలం వంటలోనే కాకుండా జుట్టు సంరక్షణకు కూడా అద్భుతమైన ఔషధ గుణాలతో నిండి ఉంది. యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఫంగల్ లక్షణాలతో కూడిన ఈ ఆకులు చుండ్రు సమస్యను తగ్గించడంలో గణనీయంగా సహాయపడతాయి. ఈ ఆకులతో తయారు చేసిన హెయిర్ మాస్క్ చుండ్రు సమస్యను చాలా వరకు తగ్గిస్తుంది. తలపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, దురద, దద్దుర్లు, పొడిబారడం వంటి లక్షణాలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ మాస్క్ తలను తేమగా ఉంచి చుండ్రును పూర్తిగా తొలగించడానికి సహాయపడుతుంది. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 


కావలసినవి:


5-7 బిర్యానీ ఆకులు
1 టేబుల్ స్పూన్ వేప నూనె 
1 చెంచా అలోవెరా జెల్
1 చెంచా ఉసిరి పొడి


తయారీ విధానం:


బిర్యానీ ఆకులను నీటిలో ఉడికబెట్టండి. ఆకులను చల్లబరచి మిక్సీలో పేస్ట్‌లా చేసుకోండి. వేప నూనె ఉంటే, దానిని కూడా పేస్ట్‌లో కలపండి. అలోవెరా జెల్, ఉసిరి పొడిని కూడా కలపండి. ఈ పేస్ట్‌ను తలకు పట్టించి 10 నిమిషాలు అలాగే ఉంచండి. తలను మసాజ్ చేసి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోండి. వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను ఉపయోగించండి.
 


ప్రయోజనాలు:


చుండ్రును తగ్గిస్తుంది.
తలపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది.
దురద, దద్దుర్లు, పొడిబారడం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
తలను తేమగా ఉంచుతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిట్కాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగయలు తీసుకోవడం చాలా మంచిది. ఆకుకూరలు తీసుకోవడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారు అవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. 


గమనిక:


ఏదైనా అలెర్జీ ఉంటే ఈ మాస్క్‌ను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి.  కళ్ళు లేదా ముక్కులోకి పేస్ట్ పడితే, వెంటనే నీటితో శుభ్రం చేసుకోండి.
ఈ హెయిర్ మాస్క్‌ను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు. ఈ సహజ పరిష్కారంతో జుట్టు ఆరోగ్యంగా మమెరిసేలా ఉండండి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి