Simple Tips To Lose BellyFat: ప్రస్తుతం చాలా మంది ఉరుకుల పరుగుల జీవనం సాగిస్తున్నారు. కనీసం తినడానికి కూడా సమయం లేకుండా ఉంటున్నారు. సమయానికి ఫుడ్ తీసుకొక పోవడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి. కొందరు గంటల తరబడి కూర్చునే వర్క్ చేస్తుంటారు. అస్సలు కదలరు. కనీసం తినే ధ్యాస కూడా ఉండదు. మరికొందరు వేళ పాళ లేకుండా తింటు ఉంటారు. బైట దొరికే జంక్ ఫుడ్ లను ఎక్కువగా తింటారు. మనం తీసుకొవల్సిన ఫుడ్ టైమ్ కు తీసుకోకున్న లేదా ఆహారం అతిగా తిన్న కూడా ఊబకాయం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వారిలో పొట్ట చుట్టు, నడుము చుట్టు కొవ్వు పేరుకుపోతుంది.  అందుకే డాక్టర్లు ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్, టైమ్ ప్రకారం తినడం అలవాటు చేసుకొవాలని సూచిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమయానికి ఫుడ్ తినడం.. 


ఫుడ్ ను టైమ్ ప్రకారం తినడం అలవాటు చేసుకొవాలి. మన శరీరంలో అంతర్లీనంగా జీవ గడియారం ఉంటుంది. టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇలాంటి సమయాలల్ తినడం మన శరీరానికి అలవాటు చేయాలి. అంటే ఆయా సమయాలలో మన పొట్టలో ప్రత్యేకంగా కొన్నిరసాయనాలు విడుదలౌతాయి. దీంతో మనం ఆయా సమయంలో తిన్న ఫుడ్ ఐటమ్స్ జీర్ణమై మన శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.


వాకింగ్ లేదా జిమ్..


ప్రతిరోజు ఉదయాన్నే కాసేపు శరీరానికి శ్రమ ఇచ్చే పనులు చేయాలి. వాకింగ్ లేదా జిమ్ లకు వెళ్లాలి. కనీసం అరగంట పాటు ఇలాంటి వర్కవుట్స్ చేస్తే మన శరీరంలోని వ్యర్థపదార్థాలు కరిగిపోతాయి. ముఖ్యంగా జిమ్ లలో కోచ్ చెప్పినట్లు వర్కవుట్స్ చేయాలి. ఇలా చేస్తుంటే క్రమంగా ఊబకాయం నుంచి ఉపశమనం లభిస్తుంది.


మొలకెత్తిన చిరుధాన్యాలు తినడం.


కొందరు ప్రతిరోజు రాత్రి నీళ్లలో శెనగలు, పేసర్లను నానబెడుతారు. దీన్ని తర్వాతి రోజు ఉదయం పూట మొలకెత్తిన తర్వాత తింటారు. ఇలా తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన  విటమన్లు, మినరల్స్ లభిస్తాయి. అదే విధంగా వీటిని ఉదయం పూట ఖాళీ పొట్టతో తీసుకొవడం వల్ల జీర్ణక్రియ పై ప్రభావం చూపిస్తుంది.  శరీరంలో ఇమ్యునిటీని పెంచుతుంది.


కూరగాయలు ఎక్కువగా తినడం..


చాలా మంది ఆకుకూరలు, ఇతర వెజిటెబుల్స్ లను అస్సలు తినరు. కేవలం అన్నం పప్పు లేదా టమాటా కూరలను ఎక్కువగా తింటారు. ఆకుకూరలు, అన్నిరకాలు వెజిటెబుల్స్ తింటేనే మన శరీరం అనేది యాక్టివ్ గా ఉంటుంది. అందుకే ఏ  సీజన్ లో లభించే కూరగాయల్ని అప్పుడు తప్పనిసరిగా తింటు ఉండాలి.


ఫ్రూట్స్ లను తినడం..


ఫ్రూట్స్ లను ఎక్కువగా తింటు ఉండాలి. కేవలం అరటి పండ్లు, కొన్ని రకాల పండ్లను ఎక్కువగా తింటారు. కానీ ప్రతిరోజు ఆపిల్, దానిమ్మ, జామ పండ్లు తినాలి. ఇలా తినడం వల్ల శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోదు. మనం ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటాం, ముసలి తనం ఛాయలు తొందరగా రావు, వెంట్రుకలు తెల్లబడవు. 


జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలి..


ముఖ్యంగా జంక్ పుడ్ లు, ఆయిలీ ఫుడ్ లకు దూరంగా ఉండాలి. వీకెంట్ లలో కూడా తినకూడదు. కేవలం మన ఇళ్లలో మాత్రమే చేసుకుని తింటు ఉండాలి. బాగా లావుగా ఉన్న వారు అన్నంను అవాయిడ్ చేసి రాత్రి పూట చపాతీలు, కర్రీలను కూడా తినేఅలవాటు చేసుకొవాలి. ఇలా ప్రాపర్ గా డైట్ ఫాలో అయితే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బైటపడోచ్చు.


Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..
Read More: Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter