Energy Drink: ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగుతున్నారా..ఇక అంతే సంగతట!
Energy Drink Side Effects: ప్రస్తుతం చాలా మంది ఎనర్జీ డ్రింక్స్‌ను విచ్చల విడిగా తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని అతిగా తాగకపోవడం చాలా మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Energy Drink Side Effects: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది ఆహారపు అలవాట్లలలో మార్పులు వస్తున్నాయి. దీని వల్ల చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఆహారాలతో పాటు ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. అయితే ఎనర్జీ కోసం చాలా మంది విచ్చల విడిగా ఎనర్జీ డ్రింక్స్‌ను అతిగా తాగుతున్నారు. అయితే ఇలా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమ్యల వస్తాయిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే రసాయానాలు ఆరోగ్యానికి హానికలిగిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఎనర్జీ డ్రింక్స్‌ను అతిగా తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల కలిగే దుష్ర్పభావాలు:
హైపర్ టెన్షన్ సమస్య:
ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగడం ఆరోగ్యానికి చాలా హానికరమని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ తాగడం వల్ల హైపర్‌టెన్షన్ సమస్య కూడా రావొచ్చు. ఎందుకంటే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు కూడా రావొచ్చు. అంతేకాకుండా దీని వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
మధుమేహం:
షుగర్ ఫ్రీ అని చెప్పుకునే అనేక ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కూడా చక్కెర ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ డ్రింక్స్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మధుమేహం తీవ్ర వ్యాధిగా కూడా మారొచ్చు.
దంతాలను దెబ్బతీస్తుంది:
ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల చాలా మందిలో దంతాల సమస్యలు కూడా వస్తున్నాయని ఇటీవలే పలు పరిశోధనల్లో తెలింది. ఆ డ్రింక్స్‌లో అధిక పరిమాణాల్లో చక్కెర ఉంటుంది. కాబట్టి చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా దంతాలు కూడా దెబ్బతినే అవకాశాలున్నాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్
Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook