Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్

Chiranjeevi Condolence to Kalatapasvi మెగాస్టార్ చిరంజీవికి కళాతపస్వికి ఉన్న బంధం గురించి తెలిసిందే. గురు శిష్యుల బంధం గురించి అందరికీ తెలిసిందే. కళాతపస్వి బర్త్ డేను చిరు ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేస్తుంటాడని తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 09:04 AM IST
  • టాలీవుడ్ తీవ్ర విషాదం
  • కన్నుమూసిన కళాతపస్వి
  • నెట్టింట్లో చిరు సంతాపం
Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్

Chiranjeevi Condolence to Kalatapasvi టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాథ్ (92) గురువారం రాత్రి మరణించారు. ఆయన కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాఢపడుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను చిరంజీవి జీర్ణించుకోలేకపోతోన్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన వేసిన ట్వీట్ అందరినీ కదిలిస్తోంది.

 

ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కే విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు. పండితులని పామరులని ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిల్మ్స్‌ని కూడా బ్లాక్ బస్టర్‌గా మలిచిన దర్శకుడు బహుషా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు ఆయన.

ఆయన దర్శకత్వంలో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాంధవుడు అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశః నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల బంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది.

ప్రతీ నటుడికి ఆయనతో పని చేయడం ఒక ఎడ్యుకేషన్ లాంటిది.. ఆయన చిత్రాలు భావి దర్శకులకు ఒక గైడ్ లాంటివి. నలభై మూడు సంవత్సరా క్రితం ఆ మహానీయుడి ఐకానిక్ చిత్రం శంకరాభరణం విడుదలైన రోజునే బహుషా ఆ శంకరుడి ఆభరణంగా ఆయన కైలాసానికి ఏతెంచారు.

ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర సీమకి, తెలుగు వారికి ఎప్పటికీ తీరనది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు.

Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News