Face mask for Glowing Skin: ఆహారంలో అవసరమైన పోషకాలు తీసుకోకుంటే ముఖం డల్‌గా నిర్జీవంగా మారుతుంది. దీంతో ముఖంపై కాంతి కూడా తగ్గిపోతుంది. ముఖంలోని మచ్చలను తొలగించి, చర్మం మెరిసేలా చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి చర్మానికి సరైన సంరక్షణతో పాటు ఆహార నియమాలపై తప్పకుండా శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. ఇంట్లో అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులతో ముఖాన్ని చంద్రబింబంలా మెరుసిపోతుంది. ఈ ఫేస్ మాస్క్‌ను ఒక్కసారి ట్రై చేయండి. దీంతో మీ ముఖరంగు రెట్టింపు కాంతివంతంగా మెరిసిపోతుంది. అది ఎలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాల్సిన పదార్థాలు..


చందనం- 1/2 tsp
పసుపు- చిటికెడు
పాలు -2 tsp
మందార పూల పొడి-1/2 tsp
గులాబీ రేకుల పొడి- 1/2 tsp
కుంకుమపూవు- 4 రెమ్మలు


ఇదీ చదవండి: ఈ పూవ్వు నీటితో ముఖానికి రెట్టింపు నిగారింపు.. నిత్యయవ్వనం..


ఫేస్‌ ప్యాక్‌ తయారీ విధానం..
పాలలో ఈ పొడులన్ని వేసుకుని మెత్తని పేస్ట్‌ తయారు చేసుకోవాలి. మీ ముఖం ఒకవేళ జిడ్డుగా ఉంటే పాలకు బదులు రోజ్‌ వాటర్ ఉపయోగించండి. ఈ ఫేస్‌ ప్యాక్‌ ముఖానికి మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్‌ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్‌ వారానికి రెండు సార్లు ఉపయోగించండి. ఈ ప్యాక్‌ తో మీ ముఖం మచ్చలేకుండా కాంతివంతంగా మెరుస్తుంది. 


ఇదీ చదవండి: అవిసెగింజలు- కలబంద మాస్క్‌తో జుట్టు స్ట్రెయిట్‌గా.. పొడుగ్గా పెరుగుతూనే ఉంటుంది..


ముఖానికి చందనం అప్లై చేయడం వల్ల ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలగిపోతుంది. ఈ మండే వేసవికి మంచి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ముఖ కాంతిని రెట్టింపు చేయడంలో చందనం కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు చందనం ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు. ఇక ఈ ప్యాక్‌ లో మనం వినియోగించిన పసుపు. తరతరాలు మన పూర్వీకులు ఆహారంతోపాటు సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వినియోగించేవారు. ఇది ముఖంపై మెరుపును తీసుకువస్తుంది. కుంకుమపూవుతో ముఖ రంగు కూడా మెరుగవుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది.గంధం కూడా ముఖానికి మంచి చల్లదనాన్ని ఇస్తూ ముఖ కాంతిని పెంచుతుంది.


ఈ ప్యాక్‌ ఎండకాలం ముఖానికి మంచి రంగును ఇవ్వడమే కాకుండా రోజంతా తాజాదనంతో కనిపించేలా చేస్తుంది. కేవలం ఎండకాలం మాత్రమే కాదు ఈ ప్యాక్‌ అన్ని సీజన్ లలో వేసుకోవచ్చు. ఏ ప్యాక్‌ అయినా ముఖానికి అప్లై చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం కూడా ముఖ్యం. చర్మం చికాకు అనిపిస్తే వేయకండి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook