Face Toner Benefits: మన ముఖం అందంగా కనిపించడానికి ఎన్నో ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటాం. అందులో భాగంగా మనం ఫేస్ టోనర్ కూడా ఉపయోగిస్తాం. దీని వల్ల మన ముఖానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మన ముఖానికి రోజంతటికి కావలసిన హైడ్రేషన్ ని అందిస్తుంది. దీంతో మన ముఖం తాజాగా కనిపిస్తుంది. ఫేస్ టోనర్  మన ముఖంపై ఉన్న టాక్సిన్స్ ను వ్యర్ధాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాల చర్మాలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అసలు ఫేస్ టోనర్ ఉపయోగించడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PH లెవల్..
మన ముఖానికి రెగ్యులర్ గా ఫేస్ టోనర్ ఉపయోగించడం వల్ల పీహెచ్ లెవెల్ సముతూలంగా ఉంటుంది. ఇది ముఖంపై  ph లెవెల్ ని సముతులం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్, ముఖంపై మచ్చలు, గుంతలు ఉంటే తొలగించడంలో సహాయపడుతుంది.


రంధ్రాలు..
ఫేస్ టోనర్ తరచూ ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న రంధ్రాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి అంతేకాదు ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ ని కూడా తొలగించి డెడ్‌సెల్స్ ని కూడా నివారిరంచడంలో ఫేస్ టోనర్  ఎఫెక్టివ్‌ గా పనిచేస్తుంది. ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.ఇది సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది 


డబుల్ క్లెన్స్..
ఫేస్ టోనర్ ని ఉపయోగించడం వల్ల ఇది ముఖంపై డబుల్ క్లెన్సింగ్‌ లాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే పోషకాలు, ఖనిజాలు మన ముఖానికి రెట్టింపు గ్లో అందిస్తాయి. ముఖంపై డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించేస్తాయి. అంతేకాదు ఫేస్ టోనర్ మంచి మేకప్ రిమూవర్ గా కూడా ఉపయోగించవచ్చు.


ఇదీ చదవండి: మీ జుట్టు 5 అడుగుల పొడవు కావాలంటే ఈ 5 తినండి.. నెలలోనే బెస్ట్‌ రిజల్ట్స్‌


బూస్ట్ హైడ్రేషన్..
ఫేస్ టోనర్ ఉపయోగించడం వల్ల ముఖానికి బూస్టింగ్ హైడ్రేషన్ ఇస్తుంది. సాధారణంగా ఈ ఫేస్ టోనర్ లో రోజ్ వాటర్ ,కీరదోసకాయతో చేసినవి ఉంటాయి. అలోవెరా తో చేసినవే ఎక్కువ శాతం ఉంటాయి. ఇవి ముఖానికి మాయిశ్చర్ ని అందించి అందంగా కనిపించేలా చేస్తాయి. రోజంతటికీ కావాల్సిన తాజదనాన్ని అందిస్తాయి.


ఇదీ చదవండి: ఈ నీటిని హెయిర్‌పై స్ప్రే చేయండి చాలు..మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతూనే ఉంటుంది..!


అంతేకాదు ఫేస్ టోనర్  ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది మన ముఖం పైన టాక్సిన్స్ పేరు పోకుండా కాపాడుతుంది. మన స్కిన్ సెల్స్ ని ఆరోగ్యకరంగా చేస్తుంది. ఫేస్ టోనర్ ఉపయోగించడం వల్ల మన ముఖం పొడిబారకుండా ఉంటుంది. ఇది మన ఫేస్‌కు మంచి న్యాచురల్ లుక్ ని అందిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి