Black Idli: సౌత్ ఇండియా(South India)లో ఫేమస్ టిఫిన్(Tiffin) ఏదంటే ఇడ్లీ(Idli) అని టక్కున చెప్పేస్తాం. ఇది చాలా తేలికగా జీర్ణం అవుతోంది. అందుకే చాలా మంది ఇడ్లీని తినడానికి ఇష్టపడతారు. సాధారణంగా ఇడ్లీలు తెలుపు రంగులో ఉంటాయి. అప్పడప్పుడు రాగి ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, పాలక్ ఇడ్లీలు కూడా మార్కెట్లో దర్శనమిస్తుంటాయి. కానీ బ్లాక్ ఇడ్లీని ఎప్పుడైనా చూశారా? కనీసం ఎప్పుడైనా విన్నారా?. బ్లాక్ ఇడ్లీ(Black Idli) గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్ర నాగ్‌పుర్‌(Nagpur)లోని సివిల్‌ లైన్ ఏరియాలో ఓ చిన్న టిఫిన్ సెంటర్ ఉంది. అది ఎప్పుడూ జనాలతో కళకళ్లాడుతోంది. ఈ టిఫిన్ సెంటర్ కు నాగ్ పూర్ వాసులే కాదు..చుట్టు పక్కల చాలా ప్రాంతాల నుంచి జనాలు వస్తారు. ఆ టిఫిన్ సెంటర్ కు అంతలా ప్రజలు రావడానికి కారణం..బ్లాక్ ఇడ్లీ.


తెలుగోడి క్రియేటివిటీ..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన  కుమార్ రెడ్డి (Kumar Reddy) కుటుంబం నాగ్‌పూర్‌ (Nagpur)లో స్థిరపడింది. అతడు పుట్టింది ఆంధ్రా అయినా.. మహారాష్ట్రలోనే పెరిగాడు. దక్షిణ భారత వంటకాలను చేయడంలలో ఆయన దిట్ట. ఇడ్లీ తయారీలో ఆయనది అందెవేసిన చేయి. కారంపొడి ఇడ్లీ, కార్న్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, చీజ్ ఇడ్లీ, చాక్లెట్ ఇడ్లీ, పిజా ఇడ్లీ, ఇడ్లీ ఫ్రై.. ఇలా దాదాపు 40 రకాల ఇడ్లీలను తయారుచేస్తున్నాడు కుమార్ రెడ్డి. అయితే ఇలాంటివి చాలా చోట్ల దొరుకుతున్నాయని ఇంకేదైనా కొత్తగా చేయాలని స్నేహితులు సూచించారు. అప్పుడు వచ్చిందే బ్లాక్ ఇడ్లీ ఆలోచన అంటాడు కుమార్ రెడ్డి. 



Also Read: Viral video: గోల్‌ కొట్టేశాను.. ఫుట్‌బాల్‌ గేమ్ ఆడిన జింక.. అబ్బా ఏమన్నా ఆనందమా!


ఎలా తయారు చేస్తారంటే...
ఈ బ్లాక్ ఇడ్లీ తయారీకీ కొబ్బరి చిప్పలు, నారింజ తొక్కలు కావాలి. వీటిని బాగా ఎండబెట్టాలి. తర్వాత బీట్ రూట్ గుజ్జును కలిపి బాగా రోస్ట్ చేయాలి. నలుపు రంగు వచ్చే వరకు వేయిస్తారు. నల్లగా మారిన తర్వాత బయటకు తీసి.. పొడి చేస్తారు. ఆ చార్ కోల్ పొడినే ఇడ్లీల్లో కలుపుతారు. ఐతే ఈ చార్ కోల్ ఇడ్లీనే కొందరు బ్లాగర్స్.. డెటాక్స్ ఇడ్లీగా పిలుస్తున్నారు. ఈ ఇడ్లీలను తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని..కుమార్ రెడ్డి అంటున్నారు. వీటి వల్ల ఇడ్లీ రుచి కూడా అదిరిపోతుందని చెబుతున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook