Viral video: గోల్‌ కొట్టేశాను.. ఫుట్‌బాల్‌ గేమ్ ఆడిన జింక.. అబ్బా ఏమన్నా ఆనందమా!

Deer football goal : ఒక జింకకు గ్రౌండ్‌లో పుట్‌బాల్‌ కనిపించింది అంతే.. వెంటనే కొమ్ములతో దాన్ని అలా తోసుకుంటూ ముందుకెళ్లింది. తాను కూడా ఒక క్రీడాకారునిలా ఫీల్‌ అయ్యింది. గోల్ కొట్టేసింది ఆ జింక. తర్వాత దాన్ని ఆనందాన్ని ఒకసారి చూడండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 08:16 PM IST
  • ఫుల్‌బాల్‌ గేమ్‌లో గోల్‌ కొడితే ఆ కిక్కే వేరప్పా...
  • ఫుట్‌బాల్‌ ప్లేయర్‌‌గా మారిన జింక
  • గోల్ చేసి.. ఆనందంతో ఎరిగి గంతులేసింది..
Viral video: గోల్‌ కొట్టేశాను.. ఫుట్‌బాల్‌ గేమ్ ఆడిన జింక.. అబ్బా ఏమన్నా ఆనందమా!

Deer scores a goal celebrates wildly like a last minute winner Goes Old Video Viral Again On Social media and google trend videos: ఫుల్‌బాల్‌ గేమ్‌లో గోల్‌ కొడితే ఆ కిక్కే వేరప్పా.. ప్రత్యర్థి ప్లేయర్స్‌ టీమ్‌ను అడ్డుకుంటూ గోల్‌ కొడితే ఆ ఆటగాడి ఆనందానికి అవధులుండవు. ఫుట్‌బాల్‌ (Football) ఆడే ప్రతి క్రీడాకారుడికి గోల్‌ కొట్టాలని ఉంటుంది. అయితే క్రీడాకారులకే కాదు మనలో ఎవరికైనా సరే ఫుట్‌బాల్‌ కనపడిందంటే చాలు.. మనం కూడా స్టోర్స్‌ పర్సన్‌లా ఫీలై పోయి కాలితో ఒక కిక్ ఇచ్చేస్తుంటాం. ఆ గేమ్‌కు ఉన్న పవర్‌‌ అలాటిందేమో మరి. 

అయితే ఒక జింకకు (Deer) కూడా ఇలాగే ఫీలయ్యింది. దానికి ఒక గ్రౌండ్‌లో ఫుట్‌బాల్‌ కనిపించింది అంతే.. వెంటనే తన కొమ్ములతో ఫుట్‌బాల్‌ను తోసుకుంటూ ముందుకెళ్లింది. తాను కూడా ఒక క్రీడాకారునిలా ఫీల్‌ అయ్యింది. 

Also Read : Andhra Pradesh: మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం పన్ను రేట్లలో మార్పులు..

ఫుట్‌బాల్‌ని (Football video) అలాగే ముందుకు తోసుకుంటూ వెళ్లి.. గోల్ కొట్టేసింది ఆ జింక. అచ్చం ఫుట్‌బాల్‌ ఆటగాడిలానే ఆ జింక ఈ గేమ్ ఆడింది. చాలా కష్టపడి ఫుట్‌బాల్‌ను డ్రిల్‌ చేస్తూ.. గోల్‌పోస్ట్‌లో వేసేసింది. ఇక ఆ తర్వాత దాని ఆనందానికి అవధుల్లేవు. హేయ్‌.. నేను గోల్ కొట్టానోచ్చ్‌ అన్నట్లుగా గెంతుతూ అటు ఇటూ పరుగెత్తింది ఆ జింక. అయితే ఈ వీడియో చాలా పాతదైనా ఇప్పుడు సోషల్‌ మీడియాలో(social media) తెగ వైరల్ అవుతోంది. నెటిజెన్స్ ఈ వీడియో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఆ జింకకు ఫుట్‌బాట్‌ ట్రైనింగ్ (Football) ఎవరు ఇచ్చారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఆ వీడియోపై (Deer Football video) మీరూ ఓ లుక్కేయండి..

 

Also Read : నవ వధువు బెడ్ రూమ్‌లో పోలీసుల తనిఖీలు-స్పృహ కోల్పోయిన అత్త-అసలేం జరిగిందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook  

 

Trending News