నిద్రలో కలలు కనడం సాధారణమే. అందులో కొన్ని మధురంగా ఉంటాయి. మరికొన్ని రహస్యంగా, కొన్ని భయానకంగా ఉంటాయి. సైకోఎనాలిస్ట్ ల ( Psychoanalysts) ప్రకారం మీ గుండెల్లో నిగూఢమైన బలమైన కోరికే , ఆశ, కల, భయం, వాంఛలు వంటివి మీ కలగా ముందుకు వస్తుందట. అయితే ఆధునిక సిద్ధాంత కర్తలు మాత్రం వాస్తవికతకు, కలలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెబుతున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం కలలకు అర్థం ఉంటుంది అని చెబుతున్నారు. Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మనిషికి వచ్చి సాధారణమైన 5 కలలు.. వాటి అర్థాలు


ఎవరో వెంటపడుతున్నట్టు.. | Some One Chasing In Dreams
డ్రీమ్ ఇంటెర్ ప్రిటర్స్ ప్రకారం మీ కలలో మీకు ఎవరైనా ఛేజ్ చేస్తున్నట్టు అనిపిస్తే...మీరు ఏదో విషయం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని అర్థమట. మీలోని భయం, కోరికకు అది ప్రతిరూపం. అయితే ఇందులో మిమ్మల్ని ఎవరు ఛేజ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక జంతువు ( Animal ) మిమ్మల్ని తరుముతోంటే, మీ ఇమోషన్స్ అంటే కోపం, తాపం, ప్యాషన్ వంటి వాటిని మీరు దాస్తున్నారు అని అర్థం. మీరు అబ్బాయి అయితే అమ్మాయి ఛేజ్ చేస్తే, లేదా అమ్మాయి అయితే అబ్బాయి ఛేజ్ చేస్తే మీరు గతంలో జరిగిన విషయాలు అనుభవాల వల్ల మరోసారి ప్రేమించడానికి భయపడుతున్నట్టు. కలలో అస్పష్టమైన రూపం కనిపిస్తే మీ బాల్యంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని మీరు మీ గుండెల్లో దాచి ఉంచుతున్నారు అని అర్థం.Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది



చాలా ఎత్తు నుంచి పడటం |Falling From Great Height in Dream
ముందుగా ఈ కలపై ఉన్న అపోహను తొలగించాలి అని అనుకుంటున్నాం. చాలా ఎత్తునుంచి పడుతున్నట్టుగా కలలు ( Dreams ) వస్తే రియల్ లైఫ్ లో మరణం తథ్యం అని చాలా మంది అనుకుంటారు. అది ఏ మాత్రం నిజం కాదు. మానసిక శాస్త్రం ప్రకారం నిజజీవితంలో ఉన్న భయాన్ని అది అద్దం పడుతుంది. మీరు ఇష్టపడి చేయాలి అనుకుంటున్న పనులను మీరు చేయలేకపోతున్నారు అని అర్థం. ఒకసారి కూర్చుని ప్రశాంతగా మీకు కావాల్సిందేంటి ? దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది నిర్ణయించుకోండి. ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు.. 



పబ్లిక్ ప్లేసెస్ లో బట్టలు లేకుండా.. 
ఇలాంటి కలలు వస్తే మీరు మీ లోపాలు, అంతరంగం గురించి ప్రజలు తెలుసుకుంటారు అని భయపడుతున్నారు అర్థం. ALSO READ| What Is Sonic Boom: ప్యారిస్ ను వణికించిన సోనిక్ బూమ్ అంటే ఏంటి ? ఎందుకలా జరిగింది ?



పళ్లు ఊడటం | Losing Teeth in Dreams



మీకు పళ్లు ( Teeth ) ఊడుతున్నట్టుగా కలలు వస్తే మీరు మీ లుక్ విషయంలో తెగ బాధపడుతున్నట్టు అర్థం. మీ వద్ద ఉన్నదేదో మీరు ప్రపంచం ( World ) ముందు ఉంచడానికి భయపడి దాచడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం అని డ్రీమ్ డిక్షనరీ రచయిత పెన్నీ పియర్స్ చెబుతున్నాడు.
Also Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?


మరణం | Death of a Family Member In Dreams
మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణిస్తున్నట్టుగా మీకు కలలు వస్తే.. దానర్థం ఏదో మార్పు జరగనుండగా డానికి భయపడుతున్నట్టు. వ్యాకులతలో ఉన్నట్టు ఆ కలకు అర్థం. మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు మరణించినట్టుగా ( Death ) వార్తలు వస్తే భవిష్యత్తు విషయంలో మీరు టెన్షన్ పడుతున్నట్టు , గతాన్ని తలచుకుని బాధపడుతున్నట్టు అర్థం. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR