IT Returns and Pan-Aadhaar link: ఐటీ రిటర్న్స్, పాన్‌కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం పూర్తయిందా, మార్చ్ 31 లోగా చేయకపోతే భారీ పరిహారమే
IT Returns and Pan-Aadhaar link: మీ ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి అతి ముఖ్యమైన అప్‌డేట్. మీ ఐటీఆర్ ఫైల్ చేశారా లేదా, పాన్ ఆధార్ కార్డు అనుసంధానం అయిందా..ఒకవేళ కాకపోతే వెంటనే పూర్తి చేయాలి. ఐదు ముఖ్యమైన ఆర్ధిక అంశాలేంటనేది తెలుసుకుందాం.
IT Returns and Pan-Aadhaar link: మీ ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి అతి ముఖ్యమైన అప్‌డేట్. మీ ఐటీఆర్ ఫైల్ చేశారా లేదా, పాన్ ఆధార్ కార్డు అనుసంధానం అయిందా..ఒకవేళ కాకపోతే వెంటనే పూర్తి చేయాలి. ఐదు ముఖ్యమైన ఆర్ధిక అంశాలేంటనేది తెలుసుకుందాం.
పాన్ -ఆధార్ అనుసంధానం, ఐటీఆర్ దాఖలు చేయడం, ట్యాక్స్ ప్లానింగ్..ఇలా 5 అతి ముఖ్యమైన ఆర్దికపరమైన అప్‌డేట్స్ గురించి తెలుసుకోండి. మార్చ్ 31వ తేదీలోగా తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన అంశాలివి. ఆర్ధికపరమైన అంశాలకు సంబంధించి చాలా అంశాలు పూర్తి చేయాల్సి ఉన్నాయి. కేవలం ఓ నెల మాత్రమే మిగిలింది. మార్చ్ 31తో ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ ఆర్ధికపరమైన ఐదు అంశాలు తప్పకుండా పూర్తి చేయాల్సిందే. ఇప్పటి వరకూ మీరు పూర్తి చేయకపోతే వెంటనే చేయాల్సి ఉంది. ఆ ఐదు అంశాలేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
పాన్ - ఆధార్ కార్డు అనుసంధానం
పాన్ నెంబర్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రక్రియకు గడువు తేదీని మార్చ్ 31, 2022 వరకూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పొడిగించింది. ఒకవేళ మీరు ఇప్పటి వరకూ పాన్‌కార్డు ఆధార్ కార్డు అనుసంధానం చేయకపోతే..ఇన్‌కంటాక్స్ శాఖకు చెందిన కొత్త వెబ్‌సైట్‌లో వెళ్లి ఆ ప్రక్రియను పూర్తి చేయండి. దీనికి మార్చ్ 31వ తేదీ చివరి తేదీ అని గుర్తుంచుకోండి.
ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్
2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అన్ని ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడుల్ని సిద్ధం చేసుకోండి. ఒకవేళ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే..ఈ నెలలో పూర్తి చేయాల్సిందే. శాలరీ ట్యాక్స్ పేయర్లకు సెక్షన్ 80 సి కింద 1.5 లక్షల వరకూ మినహాయింపు ఉంది.
ఫార్మ్ 12 బి సమర్పించడం
సంవత్సరం మధ్యలో కొత్త సంస్థలో చేరే ప్రతి వేతనదారుడు ఫార్మ్ 12 బి తప్పకుండా సమర్పించాలి. 2021-22 ఆర్ధిక సంవత్సరం మధ్యలో ఉద్యోగం మారితే..ఫార్మ్ 12 బి సహాయంతో వివరాలు సమర్పించాల్సి ఉంది. దీనికి అనుగుణంగానే కొత్త సంస్థ టీడీఎస్ మీ శాలరీ నుంచి కట్ చేస్తుంది. ఫార్మ్ 12 బిను మార్చ్ 31వ తేదీలోగా సమర్పించాల్సి ఉంది.
రివైజ్డ్ లేదా లేట్‌గా ఐటీఆర్ దాఖలు
2020-21 లేదా 2021-22 ఆర్ధిక సంవత్సరపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఆఖరి తేదీ మార్చ్ 31, 2022. ఒకవేళ మీరు మీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే..మార్చ్ నెలాఖరులోగా తప్పకుండా ఫైల్ చేయండి.
బ్యాంకు కేవైసీ పూర్తి చేయడం
మీ బ్యాంకు ఎక్కౌంట్లకు సంబంధించి కేవైసీ పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన గడువు తేదీను డిసెంబర్ 31, 2021 నుంచి మార్చ్ 31, 2022కు పొడిగించింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా తలెత్తిన ఇబ్బందుల కారణంగా కేవేసీ ప్రక్రియ పూర్తి చేయనివారికి ఈ అవకాశం కల్పించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించి ఓ సర్క్యులర్ జారీ చేసింది.
Also read: Weight Loss with Ragi: ఒకేఒక్క చిట్కాతో కొద్ది రోజుల్లోనే బరువు తగ్గే మార్గం ఉంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook