Weight Loss with Ragi: ఒకేఒక్క చిట్కాతో కొద్ది రోజుల్లోనే బరువు తగ్గే మార్గం ఉంది!

Weight Loss with Ragi: మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వారిలో చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గలేకపోతున్నారు. కానీ, ఈ వంటింటి చిట్కాను పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ బరువు తగ్గుతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 02:27 PM IST
Weight Loss with Ragi: ఒకేఒక్క చిట్కాతో కొద్ది రోజుల్లోనే బరువు తగ్గే మార్గం ఉంది!

Weight Loss with Ragi: చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామం, యోగా ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గడంలో విఫలమవుతున్నారు. స్థూలకాయంతో బాధపడుతూ.. ఎన్నో చిట్కాలను పాటిస్తూ విసిగిపోతున్నారు. అయితే వారందరికీ గుడ్ న్యూస్! కేవలం ఒక్క వంటింటి చిట్కాను పాటించడం వల్ల బరువు వెంటనే తగ్గుతారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

సాధారణంగా బరువు తగ్గేందుకు రాత్రి పూట భోజనం మానేసి.. గోధుమ పిండితో తయారు చేసిన రొట్టెలు లేదా బార్లీ, మిల్లెట్స్, సోయా ఫ్లోర్స్ తో తయారైన రొట్టెలను తింటారు. కానీ, వీటన్నికంటే వేగంగా బరువు తగ్గే ఉపాయం కూడా ఉంది. రాగి పిండితో చేసిన పదార్థాలను తినడం వల్ల వెంటనే బరువు తగ్గుతారు. 

రాగిలో పుష్కలంగా పోషకాలు..

రాగుల పిండిలో కొలెస్ట్రాల్, సోడియం వంటి పోషకాలు ఉండవు. 7 శాతం కొవ్వు పదార్ధం మాత్రమే ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్, ఫైబర్ కంటెంట్ కారణంగా వెంటనే బరువు తగ్గేందుకు అవకాశం ఉంది. 

మధుమేహం వ్యాధిగ్రస్తులకు మేలు

గోధుమలు, బియ్యం కలిపి తయారైన పిండితో రొట్టెలు చేస్తే.. అందులో పాలీఫెనాల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో రాగులను చేర్చుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనకరంగా మారుతుంది.

రక్తహీనత నివారణ కోసం

రాగుల్లో ఐరెన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రక్తహీనత, హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్న వాళ్లు రాగులతో చేసిన పదార్థాలను తీసుకోవడం మంచిది. 

ప్రోటీన్ లోపం

రాగి పిండిలో అవసరమైన అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శాకాహారుల ఆహారంలో ప్రోటీన్ మూలాలు తరచుగా ఉండవు. అటువంటి పరిస్థితిలో వారు ప్రోటీన్ లోపాన్ని అధిగమించేందుకు రాగులతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.  

ఒత్తిడిని తగ్గిస్తుంది

రాగుల్లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల మెదడుపై ఏర్పడే ఒత్తిడిని తగ్గించేందుకు సహాయం చేస్తుంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)  

ALso Read: Face Mask Beauty: చందమామలా మెరిసే ముఖసౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి!

Also Read: Internet Speed Tips: Wifi స్పీడ్ తగ్గిందా..? అన్లిమిటెడ్ & హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News