Fruit Salad Recipe: కూల్ కూల్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ.. కేవలం 5 నిమిషాల్లోనే ఇలా తయారు చేసుకోండి..
Fruit Salad Recipe In Telugu: ప్రతిరోజు వేసవికాలంలో ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు ఎండ కారణంగా వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా సహాయ పడతాయి.
Fruit Salad Recipe In Telugu: ఎండాకాలంలో శరీరం హైడ్రేట్ గా ఉండడానికి నీటితో పాటు కొన్ని పండ్ల రసాలను తీసుకోవాల్సింది అయితే చాలామంది ఈ సమయంలో ఫ్రూట్ సలాడ్స్ కూడా తీసుకుంటారు. వేసవికాలంలో అన్ని పండ్లతో తయారుచేసిన ఫ్రూట్స్ సలాడ్ ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో లభించే పోషకాలు శరీరాన్ని ఎండ నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. తరచుగా వేసవికాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత అన్ని పండ్లతో తయారుచేసిన సలాడ్ని తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలామంది వేసవికాలంలో డిహైడ్రేషన్ సమస్యలతో పాటు జీర్ణ క్రియ కూడా మందగిస్తుంది దీని కారణంగా పొట్ట సమస్యలతో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి సమయంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తప్పకుండా ఫ్రూట్ జ్యూస్ లేదా ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం ఎంతో మంచిది ముఖ్యంగా అన్ని పనులతో కూడిన ఫ్రూట్ సలాడ్ ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అన్ని సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రుచికరమైన ఫ్రూట్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం.
ఫ్రూట్ సలాడ్ కు కావలసిన పదార్థాలు:
❃ మీకు ఇష్టమైన ఎనిమిది రకాల పండ్లు
❃ ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం
❃ రుచికి సరిపడా చక్కర
❃ ఐస్ క్రీమ్ లేదా కస్టర్డ్ పౌడర్
తయారీ పద్ధతి:
❃ పండ్లను అన్నింటిని శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
❃ ఆ తర్వాత కట్ చేసుకున్న ఫ్రూట్స్ లో నిమ్మరసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
❃ ఆ తర్వాత చిక్కటి పాలను మరిగించి అందులో కావాల్సినంత చక్కెర వేసుకొని 15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది.
❃ పాలలో కస్టర్డ్ పౌడర్ ను వేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి.
❃ ఈ మిశ్రమం చల్లారిన తర్వాత కట్ చేసుకున్న మొక్కలను వేసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రిజ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుని తీసుకోవచ్చు.
చిట్కాలు:
❃ చాలామంది ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే క్రమంలో వాడిపోయిన పండ్లను వినియోగిస్తూ ఉన్నారు ఇలా తయారు చేసుకుంటే సలాడ్ అంతగా రుచిగా ఉండకపోవచ్చు.
❃ ఫ్రూట్ సలాడ్ బాగుండాలనుకుంటే కేవలం తాజా తాజాగా ఉండే ఫ్రూట్స్ ను మాత్రమే వినియోగించడం చాలా మంచిది.
❃ ఫ్రూట్స్ను కస్టర్డ్ మిల్క్‌లో వేసి ఎక్కువగా కలపడం వల్ల అవి మెత్తగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా రుచి తగ్గే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఎక్కువగా కలపడం మానుకోవాలి.
❃ సర్వ్ చేయడానికి ముందు ఫ్రూట్ సలాడ్ ని డ్రైఫ్రూట్స్ తో అలంకరించి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి