Reduce Bloating: కడుపు ఉబ్బరం సమస్యల నుంచి కేవలం ఇలా 5 నిమిషాల్లో ఉపశమనం పొందండి..
Fruits Reduce Bloating In 5 Minutes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అయితే దీని కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్నవారు పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Fruits Reduce Bloating In 5 Minutes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అయితే దీని కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్నవారు పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆయిల్, మసాలా ఆహారం తినకపోవడం, ఆహారాలను హడావిడిగా తినకపోవడం వంటివి కారణంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీని వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, కడుపు నొప్పి మొదలైన సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ క్రమంలో పలు రకాల పండ్లను తీసుకుంటే ఈ సమస్య నుంచి కేవలం 5 నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి పండ్లను తీసుకోవడం ఈ సమస్య నుంచి ఉపశమం పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..
ఉబ్బరం నుంచి బయటపడటానికి ఈ పండ్లను తినండి:
అరటి పండ్లు:
అరటిపండు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే క్రమం తప్పకుండా అరటిపండ్లను తీసుకుంటే కార్బోహైడ్రేట్లు, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. పొట్టలో అల్సర్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. దీని వల్ల కడుపులో ఉబ్బరం వంటి సమస్య కూడా దూరమవుతాయి. అరటి పండులో ఉండే మూలకాలు జీర్ణవ్యవస్థ మెరుగుపరిచి.. ఎముకలను బలంగా చేస్తాయి.
జామకాయ:
జామకాయ తినడానికి ఎంత రుచిగా ఉంటుందో.. వాటి వల్ల శరీరానికి అన్నే ప్రయోజనాలు లభిస్తాయి. జామలో ఉండే మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కడుపులో ఉబ్బరం సమస్యలు కూడా దూరమవుతాయి.
యాపిల్:
యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కార్బోహైడ్రేట్ ఫైబర్, ఐరన్, పొటాషియం, ప్రోటీన్ మొదలైనవి యాపిల్స్‌లో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి పొట్టలో సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడితే తప్పకుండా ఈ పండ్లను తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook