Glowing Skin Home Remedies: అందమైన ముఖం పొందడానికి, చర్మంపై మెరుపు రావడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల ఫలితాలు పొందిన స్పల్పకాలం మాత్రమే ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలి ఫలితాల కోసం తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించి పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ చిట్కాలను పాటిండం వల్ల చర్మ సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బొప్పాయి ఆకులతో తయారు చేసిన మిశ్రమాన్ని వినియోగించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బొప్పాయి ఆకులు వల్ల కలిగే ప్రయోజనాలు:
ఓన్
లీ మై హెల్త్ పేర్కొన్న వివరాల ప్రకారం..బొప్పాయి ఆకులు చర్మానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, సోడియం, మెగ్నీషియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


బొప్పాయి ఆకులను ముఖానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మొదటి పద్ధతి:

ముందుగా బొప్పాయి ఆకులను తీసుకోవాలి.
ఆ ఆకులను శుభ్రంగా కడగాలి.
వాటిని ఫైన్‌గా మిశ్రమంలా చేసుకోవాలి.
ఇలా తయారైన జ్యూస్‌ని వడపోసి తాగవచ్చు.


రెండవ పద్ధతి:
శుభ్రం చేసుకున్న బొప్పాయి ఆకులను తీసుకోండి.
వాటిని మిశ్రంలా చేసుకోండి.
ఇలా చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
ఇది క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


చర్మానికి బొప్పాయి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు:
బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్‌లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
చర్మంలోని మూసుకుపోయిన రంధ్రాలను తెరిపించేందుకు సహాయపడుతుంది.
చర్మంపై మొటిమలను తగ్గించడానికి కూడా బొప్పాయి మిశ్రమం సహాయపడుతుంది.
ఇందులో ఉండే గుణాలు ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడానికి కూడా దూరమవుతాయి.


Also read: Changes from April 1: ఏప్రిల్ 1 నుంచి మారనున్న వస్తువుల ధరలు, ఏవి పెరుగుతున్నాయో ఏవి తగ్గుతున్నాయో చెక్ చేసుకోండి


Also read: Changes from April 1: ఏప్రిల్ 1 నుంచి మారనున్న వస్తువుల ధరలు, ఏవి పెరుగుతున్నాయో ఏవి తగ్గుతున్నాయో చెక్ చేసుకోండి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook