Golden Milk: షుగర్ ను కంట్రోల్ చేయడంలో ఈ గోల్డెన్ మిల్క్ ఒక అద్భుతమైన ఔషధం!
Golden Milk Benefits: గోల్డెన్ మిల్క్ ఒక అద్భుతమైన ఔషధంగా పేరు పొందింది. దీని తీసుకోవడం వల్ల భయంకరమైన వ్యాధులను కూడా చిటికెలో మాయం చేసే శక్తి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Golden Milk Benefits: మనలో చాలా మంది తరుచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తారు. అందులో పసుపు పాలు ఒకటి. దీని తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య అయిన చిటికెలో మాయం అవుతుంది.
పసుపు పాలు అనేది మన భారతీయ సాంప్రదాయమైన పానీయం. దీని గోల్డెడ్ మిల్క్ అని కూడా కొందరూ పిలుస్తారు. గోల్డెడ్ మిల్క్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చు. ఇందులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, ఐరన్, కాపర్, పొటాషియం వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. పసుపుకు ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి గాయాలు తగిలినప్పుడు దీని ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపు పాలు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఎంతో సహాయపడుతాయి. అంతేకాకుండా ఇది జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ గోల్డెన్ మిల్క్ ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఇది ఒక ఔషధం అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కర్క్యుమిన్ కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శీతాకాలంలో వచ్చే అన్ని కీళ్ల సమస్యలకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మెదడు కణాలను మెరుగుపరచడంలో ఈ పాలు సహాయపడుతాయి. నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పసుపు పాలను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడానికి సహాయపడుతుంది.
ఈ గోల్డెన్ మిల్క్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి కూడా ఎంతో సహాయపడుతుంది. దీని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుంది. పసుపులోకి యాంటీ ఆక్సిడెంట్‌లు లివర్ పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ పసుపు పాలను తీసుకోవడం వల్ల మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
పసుపు పాలు తయారు చేయడం ఎలా:
* ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి.
* మీరు కోరుకుంటే, మీరు కొద్దిగా తేనె లేదా అల్లం రసం కూడా జోడించవచ్చు.
* పాలు వేడిగా ఉండేలా చూసుకోండి, కానీ మరిగించకండి.
* రోజుకు రెండు నుంచి మూడు సార్లు త్రాగాలి.
గమనిక:
* మీకు ఏవైనా అలెర్జీలు లేదా వైద్య పరిస్థితులు ఉంటే పసుపు పాలు త్రాగే ముందు కూడా వైద్యుడిని సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి