Hair Care Oil: అవకాడో నూనె జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టును సహజంగా బలంగా, మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తుంది. అందుకే చాలా  మంది ఈ నూనెను వినియోగిస్తారు.  అవకాడో నూనెలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు జుట్టుకు పోషణనిచ్చి, దృఢంగా చేస్తాయి. అంతేకాకుండా ఇందులో  విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి జుట్టును సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే దీని వల్ల జుట్టుకు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవోకాడో నూనెతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు:
1. అవోకాడో నూనెను షాంపూతో కలిపి అప్లై చేయండి:

షాంపూలో 6 నుంచి 7 చుక్కల అవకాడో ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. తర్వాత నీటితో తలను శుభ్రంగా కడడం వల్ల జుట్టుకు పోషన అంది, అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


2. హెయిర్ మాస్క్‌తో అవకాడో ఆయిల్‌ కలిపి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
అవకాడో నూనెను మరేదైనా నూనెతో కలిపి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు కుదుళ్ల నుంచి బలంగా తయారవుతాయి. అంతేకాకుండా పొడవుగా వేగంగా పెరుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ నూనె హెయిర్ మాస్క్‌లో అప్లై చేసి కూడా వినియోగించవచ్చు.


3. జుట్టు పెరుగుదల కోసం అవకాడో నూనె:
జుట్టు పెరుగుదల కోసం అవకాడో నూనెతో మీ తలకు మసాజ్ ప్రతి రోజూ మసాజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల జుట్టు డ్యామేజ్‌ని నివారిస్తుంది. అంతేకాకుండా జుట్టులో రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. దీని వల్ల స్కాల్ప్ కు కూడా పోషణ లభించి.. జుట్టును దృఢంగా చేస్తుంది.


4. అవోకాడో నూనెను సీరమ్‌:
అవకాడో నూనెను హెయిర్ సీరమ్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో జుట్టు మృదువుగా మారుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్‌లు జుట్టుకు పోషణిస్తాయి. దీంతో సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు


ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook