కేశ సంరక్షణ చాలా అవసరం. మనిషికి అందాన్నిచ్చేది కేశాలే. కేశాల్లేకుండా అందాన్ని ఊహించుకోవడం కష్టమే. అందుకే కొన్ని సులభమైన చిట్కాలతో కేశాల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేశాలు ఆరోగ్యంగా పటిష్టంగా ఉండటమే కాకుండా నిగారింపు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం వివిధ రకాల షాంపూలు, హెయిర్ మాస్క్, హెయిర్ కేర్ ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. అయినా ఆశించిన ఫలితాలు కన్పించవు. ఈ క్రమంలో..అలోవెరా మీ కేశాలకు సంబంధించిన ప్రతి సమస్యను దూరం చేస్తుంది. అలోవెరా జెల్ రాయడం వల్ల పోషక పదార్ధాలు పుష్కలంగా అందుతాయి. ఫలితంగా జుట్టు రాలడం, ఊడిపోవడం నిలిచిపోతుంది. 


1. కేశాలకు షాంపూ రాయడానికి ముందు అలోవెరా జెల్ తలభాగానికి రాస్తే జుట్టు రాలడం వంటి సమస్య పోతుంది. వారంలో 3 సార్లు రాయాల్సి ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్యకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.


2. షాంపూ రాసే ముందు కేశాల్లో అలోవెరా జెల్ల రాయడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఫలితంగా కేశాలు పటిష్టమౌతాయి. మీ కేశాలు పలుచగా, నిర్జీవంగా ఉంటే అలోవెరా జెల్ మంచి ప్రత్యామ్నాయం. వారంలో 2 సార్లు రాస్తే సరిపోతుంది. 


3. చలికాలంలో షాంపూ రాసేముందు అలోవెరా జెల్ అప్లే చేస్తే డాండ్రఫ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 


4. షాంపూ రాసిన తరువాత అలోవెరా జెల్ రాస్తే..కండీషనర్‌లా పనిచేస్తుంది. ఇలా చేసినా కేశాలకు పోషకాలు లభించి..మృదువుగా ఉంటాయి.


కేశాలకు సంబంధించిన సమస్యల్ని దూరం చేసేందుకు అలోవెరా జెల్‌లో ఒక నిమ్మకాయ రసం, కొబ్బరి నూనె కలిపి షాంపూకు ముందు తలకు బాగా రాయాలి. 15 నిమిషాలుంచిన తరువాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి.


Also read: Kidney Care Tips: ఈ ఫ్రూట్స్ తింటే చాలు జీవించినంతకాలం మీ కిడ్నీలు సేఫ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook