Hair Mask: ఇటీవలి కాలంలో కేశ సంబంధిత సమస్యలు అధికమయ్యాయి. జుట్టు రాలడం, కేశాలు జీవం కోల్పోవడం, డేండ్రఫ్, కేశాల్లో నిగారింపు లేకపోవడం, పెళుసుగా మారడం ఇలా ఒక్కొక్కొరికీ ఒక్కో రకమైన సమస్య ఉండవచ్చు లేదా అన్ని సమస్యలు బాధించవచ్చు. మార్కెట్‌లో లభించే వివిధ రకాల షాంపూలు, హెయిర్ క్రీములు వాడినా ప్రయోజనం కన్పించక విసిగిపోతుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలాంటి పరిస్థితి చాలామందిలో ఉంటుంది. కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఈ సమస్యలు సాధారణమయ్యాయి. అన్నింటికంటే కామన్ సమస్య డేండ్రఫ్. ఒక్క డేండ్రఫ్ సమస్య కారణంగా హెయిర్ ఫాల్, హెయిర్ డ్రైనెస్, జీవం కోల్పోవడం అన్నీ ఉత్పన్నమౌతాయి. డేండ్రఫ్ సమస్య దూరం చేసేందుకు అద్భుతమైన హోమ్ రెమిడీ సిద్ధంగా ఉంది. అది ఉల్లి, అల్లం హెయిర్ మాస్క్. ఈ హెయిర్ మాస్క్‌తో డేండ్రఫ్ సమస్య తొలగిపోవడమే కాకుండా కేశాలకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది. 


ఉల్లి, అల్లం రెండింటిలోనూ యంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ రెంటి మిశ్రమం డేండ్రఫ్ సమస్యను సులభంగా పరిష్కరిస్తుంది. అల్లంలో జింజ్రోల్ అనే పోషకం ఉంటుంది. ఇది స్కాల్ప్‌పై ఉండే బ్యాక్టీరియాను కూకటివేళ్లతో నిర్మూలిస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కూడా కేశాల్లో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. అందుకే ఉల్లి-అల్లం హెయిర్ మాస్క్ వినియోగిస్తే డేండ్రఫ్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అదే సమయంలో కేశాలకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది. 


ఉల్లి అల్లం హెయిర్ మాస్క్ తయారు చేసేందుకు ఒక ఉల్లిపాయ, కొద్దిగా అల్లం, తేనె అవసరమౌతాయి. ముందుగా ఉల్లిపాయను చిన్నకోసి మిక్సీలో ఆడించి రసం తీయాలి. ఆ తరవాత అల్లం రసం కూడా అదే పద్ధతిలో లేదా మరే ఇతర పద్ధతిలోనైనా తీయాలి. ఈ రెండింటినీ ఓ గిన్నెలో వేసి కలపాలి. ఆ తరువాత ఇందులో తేనె వేసి కలపాలి. అంతే మీక్కావల్సిన ఉల్లి-అల్లం హెయిర్ మాస్క్ సిద్ధం.


ఉల్లి-అల్లం హెయిర్ మాస్క్‌ను దూది సహాయంతో కేశాల కుదుళ్లకు సైతం పట్టేలా రాయాలి. ఆ తరువాత మొత్తం జుట్టుకు పట్టించాలి. తలంతా రాసిన తరువాత 20-30 నిమిషాలు అలానే ఉంచి..అప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారంలో 2-3 సార్లు పాటిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. దాంతో డేండ్రఫ్ సమస్య సులభంగా తగ్గిపోతుంది.


Also read: Weight Loss Diet: ఈ 3 ఆకులతో శరీర బరువు ఎంతైన ఇలా సులభంగా వారంలో తగ్గించుకోవచ్చు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook