Hair Growth Tips: జుట్టును పొడవుగా, ఒత్తుగా మార్చే చిట్కాలు..రోజు ఇలా చేస్తే చాలు..
How To Hair Growth Faster: జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు పొడవుగా తయారవుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
Hair Growth Tips: జుట్టు మనిషి అందాన్ని పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది. అందుకే ప్రతి స్త్రీ పొడవాటి, మందపాటి, మెరిసే జుట్టు కోసం వివిధ రకాల హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. అయితే చాలా మందిలో ఆధునిక జీవనశైలి కారణంగా పొడవాటి జుట్టు అనేది ఒక కలగానే మారింది. ప్రస్తుతం చాలా మందిలో జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే మీరు కూడా పొడవాటి జుట్టు లేదని బాధపడుతుంటే తప్పకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటించాలి. వీటిని పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గి..జుట్టు బలంగా దృఢంగా తయారవుతుంది.
జుట్టును పొడవుగా, ఒత్తుగా మార్చే చిట్కాలు:
ట్రిమ్మింగ్ చేయండి:
జుట్టు ఒత్తుగా పెరగడానికి తప్పకుండా 8 నుంచి 10 వారాలకు ఒకసారి జుట్టును కత్తిరించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరగడం ప్రారంభమవుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వేసవి కాలం మాత్రం సూర్యకిరణాల వల్ల జుట్టు దెబ్బతింటుంది. కాబట్టి జుట్టు రాలిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో జుట్టును బాగా కత్తిరించకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కండిషనింగ్:
జుట్టు మూలాల నుంచి, బలంగా, మందంగా ఉండడానికి కండిషనింగ్ తప్పకుండా చేయాలని నిపుణులు చెబుతున్నారు. కండిషనింగ్ లేకపోవడం వల్ల జుట్టుకు పోషకాలు అందే ఛాన్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా జుట్టుకు కండిషన్ చేయడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
వేడి నూనెతో మసాజ్ చేయండి:
గోరువెచ్చని నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు రాలే సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. తప్పకుండా జుట్టుకు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయాల్సి ఉంటుంది.
జుట్టు దువ్వడం ప్రయోజనకరం:
ఆయిల్ మసాజ్ తర్వాత జుట్టును దూవడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా ప్రతి రోజు దూయవ్వడం వల్ల తలలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీంతో పాటు జుట్టు పొడవుగా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి