Hair Straightening Tips: సాధారణంగా మహిళలు ఎక్కువగా హెయిర్ స్ట్రైటెనింగ్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఉంగరాల జుట్టుండే మహిళలకు మరీ ఇబ్బంది. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలకు జుట్టే అందం. మృదువుగా, పొడుగ్గా, నిగనిగలాడే జుట్టుంటే అమ్మాయిల అందం మరింత పెరుగుతుంది. అందుకే ఉంగరాలు జట్టుండే మహిళలు హెయిర్ స్ట్రైటెనింగ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్నిసార్లు సక్సెస్ అయితే..మరి కొన్నిసార్లు విఫలమౌతుంటారు. ఏదైమైనా హెయిర్ స్ట్రైటెనింగ్ కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. హెయిర్ స్మూత్నింగ్ వంటి ఖరీదైన చికిత్సా పద్ధతులు కూడా ఆశ్రయిస్తుంటారు. అయితే అందుబాటులో ఉన్న కొన్ని పదార్ధాలతో..ఇంట్లోనే కొన్ని చిట్కాలతో జుట్టును స్ట్రైట్ చేసుకోవచ్చంటున్నారు బ్యుటీషియన్లు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


1.  ఆలివ్ ఆయిల్ సహాయంతో హెయిర్ స్ట్రైటెనింగ్ చేసుకోవచ్చు. ముందుగా ఆలివ్ ఆయిల్‌తో జుట్టు మెదళ్లలో మాలిష్ చేయాలి. ఆ తరువాత జుట్టును శుభ్రమైన చల్లని నీళ్లతో మైల్డ్ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతి మంచి ఫలితాలనిస్తుంది. 


2. హెయిర్ స్ట్రైటెనింగ్‌కు మరో పద్ధతి గుడ్లు ఉపయోగించడం. పచ్చిగుడ్డును మీ జుట్టుకు బాగా పట్టించి..నెమ్మదిగా దువ్వెనతో దువ్వుకోవాలి. ఓ గంట సేపు అలానే ఉంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. 


3. ఆముదం నూనె సహాయంతో జుట్టును స్ట్రైట్ చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్‌లో ఆముదం నూనె, నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు స్ప్రే చేయాలి. ఇలా వారానికి 3-4 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.


4. ఇక చివరి పద్ధతి అలోవెరా జెల్ ఉపయోగం. ముందుగా జుట్టు మెదళ్లలో అలోవెరా జెల్ రాసి..కాస్సేపు అలానే ఉంచాలి. కాస్సేపటి తరువాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ఉంగరాల జుట్టు సమస్య పోతుంది. 


Also read: Hair Fall Reasons: జుట్టు రాలడానికి కారణాలేంటి, ఏ నెలలో ఆ సమస్య అధికం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook