Hair Fall Reasons: వర్షాకాలంలో సాధారణంగా జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ ఒక్క నెలలో పరిస్థితి మరింతగా ఉంటుంది. అసలు జుట్టు ఎందుకు రాలుతుంది, ఆ నెలలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది..
ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. వర్షాకాలంలో ఆరోగ్యపరంగానే కాకుండా ఇతరత్రా చాలా ఇబ్బందులు ఎదురౌతుంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకుంటుందనేది అందరిలో తలెత్తే సందేహం. వర్షాకాలంలో సాధారణంగా జుట్టు కాస్త తేమగా ఉండటం వల్ల స్కాల్ప్ భాగం తడిగా ఉండి..జుట్టులో పలు సమస్యలు ఏర్పడతాయి. అదే జుట్టు రాలడానికి కారణమౌతుంది. అందుకే వర్షాకాలంలో జుట్టుకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Express.co.ukలో ముద్రితమైన నివేదికలో ఏ నెలలో జుట్టు ఎక్కువగా రాలుతుందనే విషయంపై జరిపిన అధ్యయనం వివరాలు ప్రస్తావించారు. ఈ నివేదిక ప్రకారం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువ. నవంబర్ నుంచి చలికాలం ప్రారంభమౌతుంది. వాతావరణం మారిన పరిస్థితుల్లో జుట్టు రాలడం అధికమౌతుంది. తరువాత జనవరి నెల వచ్చేసరికి ఆ సమస్య నెమ్మదిగా తగ్గుతుంది.
తినే తిండి, తాగే నీరు, జీవనశైలిపై కాస్త శ్రద్ధ వహిస్తే..జుట్టు రాసే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెలలో వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. నెమ్మదిగా జనవరి వచ్చేసరికి సమస్య తగ్గుతుంది.
చాలామంది వివిధ కారణాలతో ఒత్తిడి ఎదుర్కొంటుంటారు. జుట్టు రాలడానికి ఒత్తిడి ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒత్తిడి మన ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా జుట్టు రాలడం ప్రారంభమౌతుంది. ఒత్తిడి అధికమైనప్పుడు శరీరంలో ఎడ్రినలైన్, కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో జుట్టు సహజంగా ఎదిగే ప్రక్రియలో అవాంతరాలు ఏర్పడి జుట్టు రాలడం మొదలవుతుంది.
Also read: Face Care Tips: అందమైన ముఖం కోసం..రోజ్ వాటర్‌తో ఇలా చేస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook