Valentines Day 2021 Quotes And Status: నేడు వాలెంటైన్స్ డే.. ఫిబ్రవరి 8 నుంచే ప్రేమికుల సంబరాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జరుపుకుంటున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి కాస్త హంగామా తగ్గినా, ప్రేమలో జోరు మాత్రం తగ్గదని తెలిసిందే. సినిమాల్లో ప్రేమ అనే విషయాన్ని చూపించిన సినిమాలు దాదాపుగా విజయాన్ని సాధిస్తుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ సినిమాలలో ప్రేమ కోసం రచయితలు రాసిన బెస్ట్ లవ్ డైలాగ్స్ వాలెంటైన్స్ డే(Valentines Day 2021) సందర్భంగా మీకోసం.. 
కళ్లు కూడా మాట్లాడగలవు అని తెలియదు, నీ కళ్లు నాతో మాట్లాడేదాక..
మనసులో ఏదో తెలియని, ఆ అలజడి, అట్ల ఉంటుంది అని తెలియదు, నిన్ను చూసేదాక.
ప్రాణం లేకపోయిన బతకవచ్చు అన నాకు తెలియదు. 
అది నువ్వు తీసుకుని వెళ్లిపోయేదాక. ఐ లవ్ యు..  మళ్లీ మళ్లీ ఇది రాని రోజు


Also Read: Valentines Day 2021: మీ ప్రేమను ఇలా తెలపడం బెటర్


కమిషనర్ కూతురని చెబితే భయపడిపోతామా,
కమిషనర్ కూతుళ్లను ప్రేమించకూడదా..
కమిషనర్ కూతుళ్లకు మొగుళ్లురారా..     ఇడియట్


నా ప్రేమను చాపలా పరిస్తే, ఈ భూమి సరిపోదు.
నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయ్.
శివుడు విషాన్ని దాచినట్టుగా, గుండె లోతుల్లో నిన్ను దాచుకున్నాను..  అందాల రాక్షసి


ఈ అమ్మాయిలు అసలు అర్థం కారు బాస్,
అన్ని అలవాట్లు ఉన్నవాళ్లని ప్రేమిస్తారు, కానీ ఏ అలవాటు లేనోడినే పెళ్లి చేసుకుంటారు..   నిన్ను కోరి


దేవుడు ప్రేమించే మనసు అందరికీ ఇస్తాడు,
కానీ ప్రేమించే మనిషిని కొంత మందికే ఇస్తాడు..  శతమానం భవతి


Also Read: Propose Day 2021: చేతిలోన చెయ్యేసి చెప్పేయవా, మదిలో మాటల్ని ప్రపోజ్ చేసే తరుణమిదే


మనకి ఏమైనా అయితే, ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు,
అది నా లైఫ్‌లో ఆ పిల్ల. ఆ పిల్లకి ఏమైనా అయితే, ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టె్డ్..   అర్జున్ రెడ్డి

నిజమైన ప్రేమంటే వెంటపడి ప్రేమించటం కాదు,
మనం ప్రేమించిన వాళ్లకి మనవల్ల చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే..  సోలో


ప్రేమకు చావు లేదంటారు కదా సూర్య..
అలాంటప్పుడు చచ్చేంత ప్రేమ ఎలా పుడుతుంది..   ఒక మనసు


ప్రేమించేవాడికి భయం ఉండకూడదు..
భయపడేవాడు ప్రేమించకూడదు,
భయపడుతూ ప్రేమించేవాడు బాధపడకూడదు..


Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్


ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్లు చేసే తప్పులను కూడా క్షమించగలగాలి..
లేదా ఆ మనిషిని మనం ప్రేమించడం లేదని ఒప్పుకోవాలి..  నువ్వే కావాలి 


ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది..   గమ్యం


కన్నీళ్లు మనకొస్తే కష్టమవుతుంది..
అవే మనకోసమొస్తే ప్రేమ అవుతుంది.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook