Dates Benefits: అరబిక్ సాంప్రదాయంలో ఖర్జూరం గురించి ఓ మాటుంది. మరణానికి తప్ప అన్ని సమస్యలకు పరిష్కారమని. అంతటి అద్భుత ఔషధ గుణాలు కలిగింది ఖర్జూరం. ఖర్జూరంతో బరువు సైతం తగ్గించుకోవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖర్జూరం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరంతో కలిగే లాభాలు అనేకం. ఆధునిక జీవనశైలితో ప్రధాన సమస్యగా మారిన స్థూలకాయానికి ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే బరువు తగ్గేందుకు ఖర్జూరాన్ని ఏ సమయంలో తీసుకోవాలనేది కూడా చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.


ఖర్జూరంలో ఉన్న పోషక గుణాలు చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. స్థూలకాయం మీకు సమస్యగా ఉంటే ఖర్జూరం కచ్చితంగా..ఉపయోగపడుతుంది. అయితే దీనికో పద్ధతి ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఖర్జూరం తింటే ఫలితముండదు. నిర్ణీత సమయంలో తింటేనే ప్రయోజనం కలుగుతుంది. మరి బరువు తగ్గేందుకు ఖర్జూరం ఏ సమయంలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఖర్జూరం అనేది హై ప్రోటీన్ పదార్ధం. హై ప్రోటీన్ అనేటప్పటికి బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ ఖర్జూరం రోజూ తీసుకుంటే..బరువు వేగంగా తగ్గుతారు. అయితే ప్రతిరోజూ ఉదయం పూట ఖర్జూరం తినడం మంచిది. ఉదయం వేళ పరగడుపున ఖర్జూరం తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. కేలరీలు నియంత్రించుకోవచ్చు. రాత్రి వేళ ఖర్జూరం తింటే జీర్ణక్రియలో సమస్యలు రావచ్చు. అందుకే ఎప్పుడూ ఉదయం పరగడుపున తీసుకోవడమే మంచిది. ఖర్జూరం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబోలిజం మెరుగై..శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలంటే ఖర్జూరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం వేళ పరగడుపునే తీసుకోవాలి. దీనికోసం రాత్రంతా ఖర్జూరం నీళ్లలో నానబెట్టి ఉదయం తినాలి. రోజుకు అలా 3-4 ఖర్జూరం పళ్లు తినవచ్చు. 


Also read: Ghee Purity: నెయ్యి అసలైందా..నకిలీదా తెలుసుకునేందుకు మూడు కచ్చితమైన చిట్కాలు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook