Health Benefits of Eggs eating: తల్లిపాల తరువాత అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు ( EGG )  లో మాత్రమే ఉన్నాయి. అందుకే గుడ్డును ఆరోగ్యానికి వెరి‘గుడ్డు’ అని పేర్కొంటుంటారు నిపుణులు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి.. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. రోజూ గుడ్డు తినడం కలిగే ప్రయోజనాలేంటో ( Health Tips ) ఇప్పుడు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"201228","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"egg benfits","field_file_image_title_text[und][0][value]":"benfits of egg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"egg benfits","field_file_image_title_text[und][0][value]":"benfits of egg"}},"link_text":false,"attributes":{"alt":"egg benfits","title":"benfits of egg","class":"media-element file-default","data-delta":"1"}}]]


అనారోగ్యంతో బాధపడేవారు..
పౌషకాల నిలయం గుడ్డు. ఆరోగ్య సమస్యలతోపాటు పౌష్టికాహార సమస్యలతో బాధపడేవారు ప్రతీరోజూ (boiled egg daily) ఉడకబెట్టిన ఒక గుడ్డును తినాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. దీంతోపాటు గుడ్డును చిన్నపిల్లలకు తినిపించడం వల్ల వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడంతోపాటు దృఢంగా తయారవుతారు. దీంతోపాటు గర్భిణులు, బాలింతలు కూడా రోజూ తినే ఆహారంతోపాటు రోజూ గుడ్డును తీసుకుంటే రక్తహీనత సమస్య దూరమై ఆరోగ్యవంతంగా ఉంటారు. 


బరువు పెరుగుతారన్నది అపోహ మాత్రమే..
గుడ్డు తింటే బరువు పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. ఇది అపోహ మాత్రమే. పచ్చసొనలో కొవ్వు అధికంగా ఉంటుంది. అయితే గుడ్డులో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నా.. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయి మాత్రం పెరగటం లేదని వైద్య నిపుణులు అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డులో కేలరీలు తక్కువగా ఉంటాయని.. గుడ్డు తిన్న చాలా సేపటి వరకు ఆకలి వేయదని పేర్కొంటున్నారు. దీనివల్ల బరువు కూడా తగ్గవచ్చని చెబుతున్నారు. అయితే దానిని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆమ్లెట్, ఫ్రై కాకుండా ఉడక బెట్టిన గుడ్డు మాత్రమే తీసుకోవాలి. Also read: 
Side effects of Vitamin D pills: విటమిన్ డి పిల్స్ వాడుతున్నారా ? ఐతే రిస్కే!


గుడ్డుతో పలు రోగాలు దూరం..
శరీరంలో కణాల పనితీరు, వాటి ఎదుగుదల, శక్తిని అందించటంలో గుడ్డు బాగా దోహదపడుతుంది. గుడ్డులోని ల్యూటీన్‌ యాంటీ ఆక్సిడెంట్లు కంటి జబ్బుల ముప్పు తగ్గటానికి సహాయపడతాయి. దీంతోపాటు వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండటానికీ, పక్షవాతం ముప్పు నుంచి కూడా గుడ్డు తప్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రతీరోజు ఆహారంతోపాటు ఉడకబెట్టిన గుడ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.  Also read: 
Benefits of Egg: రోజూ ‘గుడ్డు’ తింటే ఎన్ని లాభాలో తెలుసా?


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook