Side effects of Vitamin D pills: విటమిన్ డి పిల్స్ వాడుతున్నారా ? ఐతే రిస్కే!

విటమిన్ డి తక్కువగా ఉన్న వారికి కరోనావైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందనే నివేదికల నేపథ్యంలో చాలామంది తమకు తాము సొంతంగా విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు.

Last Updated : Dec 9, 2020, 12:34 PM IST
  • విటమిన్ డి లోపంతో తలెత్తే సమస్యలు ఏంటి ?
  • విటమిన్ డి అధికంగా తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ?
  • డాక్టర్లను సంప్రదించకుండా తమకు తాము సొంతంగా విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకుంటే కలిగే నష్టం ఏంటి ?
Side effects of Vitamin D pills: విటమిన్ డి పిల్స్ వాడుతున్నారా ? ఐతే రిస్కే!

విటమిన్ డి తక్కువగా ఉన్న వారికి కరోనావైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందనే నివేదికల నేపథ్యంలో చాలామంది తమకు తాము సొంతంగా విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు. అయితే, విటమిన్ డి లోపం శరీరంపై ఎంత దుష్ప్రభావం చూపిస్తుందో.. అది ఎక్కువ అయితే కూడా అంతే ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటున్నారు వైద్య నిపుణులు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విటమిన్ డి పిల్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు.

Side-effects-of-Vitamin-D-tablets-side-effects-of-using-Vitamin-D-pills

Common symptoms of Vitamin D deficiency: విటమిన్ డి లోపం లక్షణాలు.. 

  • Fatigue: అలసటగా ఉండటం, మత్తుగా అనిపించడం.
  • Body ache: ఒంటి నొప్పులు కలగడం.
  • weakness: ఒంట్లో బలహీనత రావడం.
  • Chest pain: ఛాతిలో నొప్పిగా అనిపించడం వంటివి విటమిన్ డి లోపాన్ని సూచించే లక్షణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. 

Also read : How to check infections: ఇన్‌ఫెక్షన్స్‌ని ఇలా దూరం పెట్టండి

Side-effects-of-Vitamin-D-pills-benefits-of-Vitamin-D-Vitamin-D-foods

Things to know about Vitamin D: విటమిన్ డి గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

  • ఎప్పుడు పడితే అప్పుడు విటమిన్ డి పిల్స్ తీసుకోకూడదు.
  • శరీరంలో విటమిన్ డి లెవల్స్ ఎక్కువైనా అనారోగ్యానికి దారితీస్తుంది.
  • విటమిన్ డి ట్యాబ్లెట్స్ ( Vitamin D tablets ) తీసుకునే ముందు శరీరంలో విటమిన్ డి లెవెల్స్ ( Vitamin D ) ఏ స్థాయిలో ఉన్నాయో అనేది టెస్ట్ చేయించి తెలుసుకోవాలి.
  • విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఏ స్థాయిలో అవసరమో ఆ స్థాయిలో మాత్రమే విటమిన్ డి పిల్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆపేయాల్సి ఉంటుంది.
  • శరీరం నలుపు ఉన్న వారిలో విటమిన్ డి తక్కువగా ఉత్పత్తి అవుతుందని.. అలాగని వారిలో రోగ నిరోధక శక్తి ( Immunity ) తక్కువగా ఉంటుందని అంచనా వేయలేమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది.
  • విటమిన్ డి లెవెల్స్ అధికంగా ఉన్న వారిలో కళ్లు తిరగడం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెద్యులు చెబుతున్నారు.

Side-effects-of-Vitamin-D-tablets-problems-of-Vitamin-D-pills-Soorces-of-vitamin-D

  • కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు కూడా విటమిన్ డి పిల్స్ అధిక మోతాదులో తీసుకున్న వారిలో కనిపించే లక్షణాలు.
  • విటమిన్ డి పిల్స్ ( Vitamin D pills ) ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

Also read : Health tips for glowing skin: అందమైన మెరిసే చర్మం కోసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News