Shalgam Health Benefits: ఎర్రగా బీట్ రూట్ ని పోలి ఉన్న దుంప పేరు టర్నిఫ్. దీనిని స్థానికంగా ఎర్ర ముల్లంగి, షల్గం అనే పేర్లుతో పిలుస్తారు. ఇది శీతాకాలంలో ఎక్కువగా పండుతోంది. టర్నిప్ పోషకాల నిల్వ. ఇందులో విటమిన్లు ఎ, బి, సి, ఇ మరియు కె, ఐరన్, కాల్షియం, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. టర్నిప్‌లలో మొక్కల ఆధారిత రసాయనాలైన 'గ్లూకోసినోలేట్స్' ఉన్నాయి, ఇవి బ్రెస్ట్ నుండి ప్రోస్టేట్ క్యాన్సర్ వరకు అన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధించడంలో సహాయపడతాయి. అందుకే వారానికి ఒకసారి తప్పకుండా తినండి.
2. టర్నిప్ ఒక డైటరీ నైట్రేట్ ఆహారం. ఇది రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా రక్తపోటును తగ్గించడం మరియు రక్తంలో ప్లేట్‌లెట్స్ ఒకదానితో ఒకటి అంటుకోకుండా నిరోధించడం వంటివి చేస్తుంది.
3. షల్గం యాంటీ ఆక్సిడెంట్ లుటీన్‌తో కూడిన కూరగాయ. ఇది కళ్ల సమస్యల రాకుండా చేస్తుంది. అంతేకాకుండా కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.  
4. టర్నిప్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే డైవర్టికులిటిస్ పేగు సమస్యలు రాకుండా తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
5. టర్నిప్‌లో లిపిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మరోవైపు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. 


Also read: Sweet Corn Benefits: స్వీట్ కార్న్ తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే వదలరు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook