Sweet Corn Benefits: మెుక్కజొన్నలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెుక్కజొన్న రెండు రకాలుగా లభిస్తుంది. మెుదటిది సాధారణమైనది, రెండోది స్వీట్ కార్న్. చాలా మంది స్వీట్ కార్న్ తినడానికే ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులో పైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ప్రోటీన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పైటో కెమికల్స్ సమృద్ధిగా లభిస్తాయి. దీనిని తినడం వల్ల హెల్త్ కు సంబంధించిన అనేక సమస్యలు దూరమవుతాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ ఉపయోగాలు
** బేబీ కార్న్ లో బీటా కెరోటిన్ అనే యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటిచూపను మెరుగుపరుస్తాయి.
** ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
** కార్న్ లో ఉండే ఫెరూలిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
** స్వీట్ కార్న్ రక్తంలోని చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుంది.
** ఇందులో ఉండే విటమిన్ బి12 ఎనీమియాను తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
** బాడీలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచటంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
** మొక్కజొన్నలో మెగ్నీషియం, ఆర్సెనిక్ పుష్కలంగా లభిస్తాయి. ఇది ఎముకలు గట్టిపడటంలో సహాయపడుతుంది.
Also Read: Green Tea: గ్రీన్ టీలో వీటిని కలిపి తాగితే... క్యాన్సర్ తో సహా చాలా వ్యాధులు దూరం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook