Face Detox masks: శరీరంలో అంతర్గతంగా డీటాక్స్ చేసేందుకు కొన్ని రకాల డ్రింక్స్ తాగుతుంటాం. అదే విధంగా ముఖానికి కూడా డీటాక్స్ అవసరమంటున్నారు బ్యుటీషియన్లు. సీజన్ మారేకొద్దీ ముఖంపై పింపుల్స్, బ్లాక్ హెడ్స్ , మచ్చలు రాకుండా ఉండాలంటే డీటాక్స్ అనేది చాలా అవసరం.  ముఖాన్ని డీటాక్స్ చేసే కొన్ని హోమ్ మేడ్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణకై ఖరీదైన స్కిన్ కేర్ క్రీములు, ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. వీటితో సరైన ఫలితాలు రాకపోవడమే కాకుండా దుష్పరిణామాలు కూడా ఉత్పన్నం కావచ్చు. ఒకవేళ ఏదైనా ఫలితం కన్పించినా అది తాత్కాలికమే అవుతుంది. సహజసిద్ధంగా నిగారింపు వచ్చేందుకు మార్కెట్‌లో లభించే వస్తువులు వాడకూడదంటారు. సాధారణంగా సీజన్ మారిన ప్రతిసారీ చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. చర్మం దురదగా ఉండటం, ర్యాషెస్ రావడం వంటివి జరుగుతుంటాయి. చర్మంపై నిగారింపు కోల్పోతుంటారు. ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని హోమ్ మేడ్ చిట్కాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే శరీరానికి చేసినట్టే ముఖానికి కూడా డీటాక్స్ చాలా అవసరం. దీనికోసం 3 రకాల ఫేస్‌మాస్క్‌లు ఉపయోగించవచ్చు. పూర్తిగా సహజసిద్ధమైనవి కావడంతో ఏ విధమైన దుష్పరిణామాలుండవు. 


ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాలతోనే డీటాక్స్ ఫేస్‌మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇందులో మొదటిది ద్రాక్ష ఫేస్‌మాస్క్. ద్రాక్ష అనేది బెస్ట్ డీటాక్సింగ్ ఏజెంట్. ఇది తయారు చేయాలంటే ముందుగా ద్రాక్షను మ్యాష్ చేసుకోవాలి. ఆ తరువాత రసం తీసి ఓ గిన్నెలో వేసి రెండు స్పూన్ల పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఓ అరగంట తరువాత నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. మచ్చలు వంటివి ఉంటే తొలగిపోతాయి.


రెండవ హోమ్ మేడ్ డీటాక్స్ ఫేస్‌మాస్క్ అరటి పండుతో చేసేది. బనానా ఫేస్‌మాస్క్. అరటి పండ్లతో ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు ఒక అరటి పండును గుజ్జుగా చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20-30 నిమిషాలుంచాలి. ఆ తరువాత నీళ్లతో ముఖం క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల చర్మంలో డ్రైనెస్ పోతుంది. ముఖంలో మాయిశ్చరైజ్ ఉంటుంది. 


మూడవ హోమ్ మేడ్ ఫేస్‌మాస్క్ టొమాటో.  టొమాటో తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో ముఖానికి గ్లో పెంచడంలో కూడా అంతే దోహదపడుతుంది. ముందుగా టొమాటో గుజ్జుగా చేసుకోవాలి. రసం తీని గిన్నెలో పోసుకోవాలి. ఈ రసంలో ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు వదిలేయాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం పూర్తిగా డీటాక్స్ అవుతుంది. వారానికి 2-3 సార్లు రాయడం మంచిది.


Also read: Kidney Donation: కిడ్నీ దానం చేశాక సాధారణ జీవితం సాధ్యమేనా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook