Morning Tips: ఉదయం బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం మంచి అలవాటేనా, ఏం జరుగుతుంది
Morning Tips: శరీరంలో అవయవాలు అన్ని సక్రమంగా పనిచేయాలంటే..హైడ్రేట్‌గా ఉండటం తప్పనిసరి. తగిన మోతాదులో నీళ్లు తాగడం అవసరం. అయితే నీళ్లు తాగే ఈ అలవాటు మంచిదా కాదా అనేది తెలుసుకుందాం..
శరీరానికి నీళ్లు చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తప్పకుండా తాగాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఉదయం పరగడుపున నీళ్లు ఎలా తాగాలనేది కొన్ని సూచనలున్నాయి. అంటే బ్రెష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో చూద్దాం..
రోజంతా మీరు తాగే నీళ్లు..రాత్రి మీరు పడుకున్నప్పుడు బాడీని హైడ్రేట్ చేస్తుంది. రాత్రి వేళ సహజంగానే దాహం ఎక్కువగా ఉంటుంది. నిద్ర కారణంగా లేచి తాగరు. అందుకే లేవగానే నీళ్లు తప్పకుండా తాగాలి. దీనివల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. నోటి లోపల కీటాణువులు, బ్యాక్టీరియా రాత్రి వేళ చాలా రెట్లు పెరిగిపోతాయి. ఉదయం బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల నోరు క్లీన్ అయిపోతుంది. బ్రష్ కంటే ముందు నీళ్లు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ లేదా జ్వరం వంటి వ్యాధుల సమస్య తగ్గిపోతుంది.
రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటాయి. బ్రష్ కంటే ముందు నీళ్లు తాగే అలవాటుతో అధిక రక్తపోటు నియంత్రితమౌతుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. గ్యాస్, అజీర్తిని దూరం చేస్తుంది. రోజు ప్రారంభాన్ని గ్లాసు నీళ్లతో చేస్తే..మంచి ఫలితాలుంటాయి. గ్యాస్ట్రైటిస్ లేదా అజీర్తి వంటి సమస్యలతో ఇబ్బంది రావచ్చు. చర్మ సంరక్షణ, కేశ పరిరక్షణ సాధ్యమౌతుంది. ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల ఇది సాధ్యమౌతుంది.
Also read: Yoga For Stiffness: యోగా చేసే క్రమంలో ఈ 5 తప్పులు చేస్తే అంతే సంగతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook