Stomach Pain: ఉదర సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్స్ తాగాల్సిందే..
Health tips; మనం ఇంట్లో చేసుకునే డ్రింక్స్ ద్వారా ఉదర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఎలాగో ఓసారి తెలుసుకుందాం రండి.
Stomach Pain home drinks: మన జీవన శైలిలో మార్పులే అనారోగ్యానికి కారణమవుతాయి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో తిండి టైంకు తినకపోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలు వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఈ మధ్య అందరూ ఆయిల్ పుడ్, జంక్ పుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ తప్పుడు ఆహారపు అలవాట్లు కారణంగా మీరు ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. దీని నుండి ఉపశమనం పొందాలంటే ఇంట్లో తయారు చేసిన కొన్ని డ్రింక్స్ లేదా పానీయాలు తీసుకుంటే చాలు. క్షణాల్లో మీ కడుపు నొప్పి మాయం అవుతుంది. ఆ డ్రింక్స్ అంటే ఓసారి లుక్కేద్దాం.
** ఉదర సంబంధిత సమస్యలను నయం చేయడంలో పెరుగు చాలా మేలు చేస్తుంది. ఒక కప్పు పెరుగులో జీలకర్ర పొడి మరియు బ్లాక్ సాల్ట్ వేసి .. రెండింటినీ బాగా కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట సమస్యలు దూరమవుతాయి.
** కడుపు సమస్యలను చెక్ పెట్టడంలో సోంపు టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం ద్వారా కడుపులో మంటను నివారించవచ్చు. మరిగించిన నీటిలో చెంచా ఫెన్నెల్(సోంపు) మరియు రెండు స్పూన్లు తులసి ఆకులు వేసి బాగా వేడిచేసి తర్వాత వడకట్టి తాగాలి.
** వాము నీరు తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందవచ్చు, దీనిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీకు మంచి రిలీప్ లభిస్తుంది.
** నిమ్మరసం తాగడం వల్ల కూడా కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
** కడుపునొప్పి వచ్చినప్పుడు ఇంగువ నీటిని తాగాలి. అర చెంచా ఇంగువను నీటిలో కరిగించి తాగడం వల్ల పొట్ట సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Also Read: Diet For Diabetes: లక్ష్మణఫలంతో మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook