Hanuman Fruit For Diabetes: పండ్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించి శరీరాన్ని శక్తివంతం చేస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ యాపిల్ అరటి, ద్రాక్ష, నారింజ, బొప్పాయి మొదలైన పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా రకాల దీర్ఘకాలీక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే లక్ష్మణఫలం క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు, షుగర్, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన ఔషధ గుణాలతో పాటు, పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
లక్ష్మణఫలం ప్రయోజనాలు:
లక్ష్మణఫలం మన భారత దేశంలో ఎక్కువగా లభిస్తాయి. దీనిని ఇతర దేశాల వారు సోర్సోప్ అని అంటారు. ఈ పండు రుచికరంగా ఉండడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అందుకే Annona muricata అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఇది సాధారణంగా సీతాఫల కుటుంబానికి చెందినదే..అచ్చం దానిని పోలి ఉంటుంది. ఇది బయటి భాగం ఆకుపచ్చగా, లోపలి భాగం తెల్లగా ఉంటుంది.
డెంటల్ ఇంప్లాంట్:
లక్ష్మణఫలంలో విటమిన్ సి అధి. అలాంటి పండు శరీరాన్ని ఎప్పుడూ శక్తివంతంగా ఉంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ అధిక పరిమాణంలో లభిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. ఈ పండులో ఫైటోస్టెరాల్స్, టానిన్లు, ఫ్లేవనాయిడ్ల లభిస్తాయి.
క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
ఈ పండు తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఈ పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఈ రసం ప్రతి రోజూ తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్ కణితిని తగ్గించి..క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం, వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది మధుమేహం వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి శరీరంలో బ్యాక్టీరియల్ గుణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది కీళ్లనొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.
Also Read: Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం
Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Diet For Diabetes: లక్ష్మణఫలం మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుందా?