Benefits of Pomegranate For Health: దానిమ్మ పండు ఆరోగ్యానికి వరం. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఔషధాల గని. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్దాప్యాన్ని దరిచేరనీయదు. దీనిని రోజూ తినడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి. దానిమ్మ పండును గింజల రూపంలో తినకపోతే జ్యూస్ చేసుకుని తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఫ్రూట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దీని వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానిమ్మ ప్రయోజనాలు
** మధుమేహ వ్యాధిగ్రస్తులు, షుగర్ పేషెంట్లు దానిమ్మను తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. 
** దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 
** దానిమ్మపండులో ఫైబర్ మరియు అనేక పోషకాలు ఉన్నాయి, ఇవి జీర్ణ శక్తిని పెంచడంలో సహాయపడతాయి. 
** దానిమ్మ పండు మలబద్ధకం దూరం చేస్తుంది. 
** దానిమ్మ పండు తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. 
** బీపీ ఉన్నవారు దానిమ్మపండు తీసుకోవడం వల్ల కంట్రోల్ లో ఉంటుంది. 
** ఎముకల ఆరోగ్యంగా ఉంచటానికి దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. 
** ఇది అల్జీమర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటుంది. 


Also Read: Goa tourism: అలర్ట్.. గోవాకు వెళ్లేవారు ఇకపై అక్కడ ఆ పని చేయెుద్దు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook