Goa Travel Advisory: మన ఇండియాలో ఎంజాయ్ చేయడానికి లేదా చిల్ అవ్వడానికి ముందుగా గుర్తొచ్చే ప్లేస్ గోవా. ఇక్కడ ఉండే అందమైన బీచ్‌లు, టూరిస్ట్ ప్రదేశాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే మనలో చాలా మంది ఒక్కసారైనా గోవా వెళ్లాలని అనుకుంటారు. మందుబాబులకు అయితే ఇది స్వర్గధామమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ కాస్ట్ చాలా తక్కువ. ఇక్కడ చిల్ అవ్వడానికి అందమైన రిసార్టులు, క్యాసినోలు అందుబాటులో ఉన్నాయి.
అయితే ఇకపై గోవా వచ్చే ప్రయాణీకులకు అక్కట పర్యాటక శాఖ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది. ముఖ్యంగా అక్కడికి వెళ్లినప్పుడు అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలు తీయెుద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మీరు అలా ఫోటోలు తీయాలనుకుంటే వారి నుంచి ముందుస్తు అనుమతి పొందాలని స్పష్టం చేసింది. పర్యాటకుల భద్రత, గోప్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అంతేకాకుండా, టూరిస్ట్ ప్రదేశాలలో ప్రమాదాలను అరికట్టడానికి ఇకపై రాళ్లు, కొండలు, గుట్టల అంచులపై నిల్చొని ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడాన్ని బ్యాన్ చేసింది. ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు లేదా వారసత్వ ప్రదేశాలను పాడు చేయవద్దని పర్యాటకులకు సూచించింది. గోవాలో ఎక్కడికి వెళ్లిన పర్యాటక శాఖచే గుర్తింపు పొందిన హోటల్స్, రిసార్టులను మాత్రమే బుక్ చేసుకోవాలని..గుర్తింపు లేని వాటిని నమ్మెుద్దని కోరింది.
Also Read: Coconut water: కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా... అయితే ఈ జబ్బులు కొనితెచ్చుకున్నట్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook