Running Tips: ఫుల్ బాడీ వర్కవుట్ చేయాలనుకున్నప్పుడు రన్నింగ్ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం. మరి రన్నింగ్ తరువాత కొన్ని పొరపాట్లు చేయకూడదని మీకు తెలుసా..అవేంటో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటుంటారు. దీనికోసం వివిధ రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. ఫుల్ బాడీ వర్కవుట్ కోసం రన్నింగ్ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం. రన్నింగ్ వల్ల మీ బాడీ సామర్ధ్యం పెరగడమే కాకుండా..,మొత్తం బాడీ అంతా షేప్‌లో ఉంటుంది. రన్నింగ్ ద్వారా మీ శరీరంలోని కేలరీలను సులభంగా కరిగించుకోవచ్చు. కానీ కొంతమందికి రన్నింగ్ తరువాత కూడా ఏ విధమైన ఫలితాలు కన్పించవు. ఫలితంగా మీరు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. ఇలా ఎందుకవుతుందంటే..రన్నింగ్ సందర్భంగా లేదా రన్నింగ్ తరువాత మీరు చేసే కొన్ని రకాల పొరపాట్లు. మేం ఇప్పుడు మీకు ఆ తప్పులేంటో రన్నింగ్ తరువాత ఏయే పొరపాట్లు చేయకూడదో వివరిస్తాం..


రన్నింగ్ తరువాత బాడీని డీహైడ్రేట్ చేయడం చాలా అవసరం. మీ బాడీని రీ హైడ్రేట్ చేసేందుకు సహజంగా జనం నీళ్లు తాగుతుంటారు. కానీ మీరు నీళ్లు తాగకుండా కొబ్బరి నీళ్లు తాగాలి. వర్కవుట్స్ చేసేటప్పుడు మీ శరీరం విపరీతమైన ఒత్తిడిలో ఉంటుంది. అటువంటప్పుడు మీ బాడీకు ఒక బ్రేక్ ఇవ్వాల్సిన అవసరముంది. అందుకే రన్నింగ్‌తో పాటు మద్యమధ్యలో విశ్రాంతి కూడా తీసుకోవాలి. దీనికోసం అవసరమైన నిద్ర తీసుకోవాలి. రాత్రి సమయంలో కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ప్రతిరోజూ రన్నింగ్ చేయకుండా..ఆల్టర్నేటివ్ రోజుల్లో రన్నింగ్ చేయడం మంచిది. 


చాలామంది రన్నింగ్ తరువాత నీళ్లు లేదా నిమ్మకాయ జ్యూస్ తాగి సరిపెట్టుకుంటారు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. రన్నింగ్ తరువాత ఎప్పుడూ నిద్రపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల వర్కవుట్ తరువాత ప్రోటీన్ రీఛార్జ్ అవుతుంది. ఎండ వేడిమి నుంచి రక్షించుకునేందుకు బేకింగ్ సోడా ఓట్ మీల్ నీళ్లతో స్నానం చేయాలి. దీనికోసం బకెట్ లో నీళ్లు నింపుకోవాలి. తరువాత ఇందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ఆ తరువాత ఆ నీటితో మీ ముఖం కడగాలి. 


Also read: Summer Care: వేసవిలో డయాబెటిస్ రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook