How to reduce Body heat in summer: వేసవి కాలం వచ్చేసింది. దీంతో మన శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా వడదెబ్బ తగలడం, బాడీ డీహైడ్రేషన్ కు గురవడం జరుగుతుంది. ఎండాకాలంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సమ్మర్ లో శరీరంలోని నీరు చెమట రూపంలోకి బయటకు రావడంతో బాడీ హీటెక్కుతుంది. దీని కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడతారు. శరీరంలో వేడి తగ్గించే ఇంటి చిట్కాలు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒంట్లో వేడి తగ్గించే చిట్కాలు
** సాధారణ రోజుల్లో తీసుకునే నీరు కన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హీట్ తగ్గుతుంది. 
** సిట్రస్ జాతి పళ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతోపాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీంతో మీ బాడీలో వేడి తగ్గుతుంది. 
** ఈ కాలంలో మజ్జిగను అధిక మెుత్తంలో తీసుకోవడం వల్ల శరీరపు వేడిని తగ్గిస్తుంది. 
** పెరుగు అన్నం కూడా మంచి ఆప్షన్ అనే చెప్పాలి. వేసవిలో దీనిని ఎక్కువ తినటం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
** కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. 
** గ్లాస్ చల్లని పాలలో ఓ టీ స్పూన్ తేనె కలుపుకొని తాగడం వల్ల శరీరంలోని వేడి దూరమవుతుంది. 
** మెంతులను తినడం వల్ల కూడా హీట్ తగ్గుతుంది. ఒక వేళ మీకు చేదుగా అనిపిస్తే దానిని పొడిగా చేసుకుని నీళ్లలో కలుపుకుని తాగండి. 


Also Read: Benefits of Mango: మామిడి పండుతో మతిపోగొట్టే ప్రయోజనాలు..!


** గసగసాలను గుండ చేసి నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల కూడా మ బాడీ హీట్ రెడ్యూజ్ అవుతుంది. 
** ఓ గ్లాస్ పాలలో కాస్త వెన్న కలుపుకొని తీసుకుంటే మీ బాడీలోని వేడి అంతా బయటకు పోతుంది. 
** గంధాన్ని అరగదీసి.. ఆ పేస్ట్ ను నుదుటిపై రాయడం వల్ల కూడా వేడి తగ్గుతుంది. 
**  నిమ్మరసం రోజూ తాగడం వల్ల కూడా హీట్ రాదు. సబ్జా నీరు తీసుకోవడం శరీరం వేడి అవ్వదు.
** కర్భూజా, పుచ్చకాయ, ద్రాక్ష లాంటి పండ్లను తీసుకోవడం ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు.
**  వేడి పాలలో పచ్చ కర్పూరంతోపాటు యాలకుల పొడి, గసగసాల పొడి కలుపుకుని తాగితే శరీరంలో వేడి అంతా ఇట్టే బయటకు పోతుంది.  


Also Read: Hair Care Tips: రోడ్లపై దొరికే ఈ పూలతో మీ జట్టు సహజసిద్ధంగా నల్లబడటం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి